న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్ లో జరిగిన పేలుళ్ల కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలంను శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. పేలుళ్లు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న షహనూర్ ఎట్టకేలకు చిక్కాడు. మయన్మార్ ఉగ్రవాది మహ్మద్ ఖలీద్ ఇచ్చిన సమాచారంతో షహనూర్ ను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
అసోంలోని బార్పేట జిల్లా చతాలో ఉన్న అతని నివాసంలో గత నెలలో ఎన్‌ఐఏ సోదాలు జరిపారు. ఆరు గంటల పాటు సోదాలు జరిపి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సాజిద్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయగా, మయన్మార్ ఉగ్రవాది మహ్మద్ ఖలీద్‌ను ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో అక్టోబర్ 2న బాంబు పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.
బర్ద్వాన్ పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్ట్
Published Sat, Dec 6 2014 3:51 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
Advertisement
Advertisement