అతిపెద్ద టమాటా మార్కెట్ను తాకిన నోటు దెబ్బ | Kolar: Asia’s No. 2 tomato market has no bank or ATM | Sakshi
Sakshi News home page

అతిపెద్ద టమాటా మార్కెట్ను తాకిన నోటు దెబ్బ

Published Sat, Nov 26 2016 11:18 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

అతిపెద్ద టమాటా మార్కెట్ను తాకిన నోటు దెబ్బ

అతిపెద్ద టమాటా మార్కెట్ను తాకిన నోటు దెబ్బ

బెంగళూరు:  డీమానిటేజేషన్  కష్టాలు కోలార్ టమోటా మార్కెట్ ను భారీగా తాకాయి. ఒకవైపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, మరోవైపు  బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో   రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు, రవాణా ఎజెంట్లు,  ట్రక్ డ్రైవర్లు  అష్టకష్టాలు పడుతున్నారు. ఆసియాలోని రెండవ అతిపెద్ద  టమోటా  మార్కెట్ గా పేరుగాంచిన కోలార్ మార్కెట్ యార్డ్  లో ఒక్క బ్యాంకు గానీ,  ఏటీఎం సెంటర్ గానీ లేకపోవడం ఆందోళనగా మారింది.  

కర్ణాటక రాజధాని బెంగళూరుకు  సమీపంలోని  కోలార్‌ లోని టమాటా మార్కెట్ దేశంలో అతిపెద్ద  మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది.  పింపాల్ గాన్, నాసిక్ తర్వాత  దక్షిణ భారతదేశం అతి పెద్దదైన  కోలార్ ..కర్ణాటక రాజధాని  బెంగళూరుకు కేవలం 70 కి.మీ ల దూరంలో ఉంది.   అయితే ఇక్కడ ఉన్న బ్యాంకు పనిచేయక, సమీపంలో ఎలాంటి బ్యాంకు గానీ, ఏటీఎం సెంటర్  గానీ లేక ఇక్కడి వ్యాపారుల  కష్టాలు అన్నీ ఇన్నీ కావు.   దిగుబడి బాగా వచ్చినా,   సరిపడినంత డిమాండ్  ఉన్నా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి దాపురించిందని వ్యాపారి మునియప్ప చెప్పారు.  ఇంకా పాతనోట్లతోనే వ్యాపారం చేస్తున్నామనీ,  వీటిని  బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం పెద్ద సమస్యగా మారిందన్నారు.  దీంతో తమ  సిబ్బంది  వేతనాల చెల్లింపు ఆలస్యం కానుందన్నారు.  
రైతులు నగదు చెల్లింపులకోసం ఒత్తిడి చేస్తున్నారనీ, చెక్ లను  అంగీకరించడం లేదన్నారు. దీంతో తమకు నగదు కొరత ఏర్పడిందన్నారు.  రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటీఎం కేంద్రం క్యూలో తమ కూలీలు ఎక్కువసేపు నిలబడ్డ మూలంగా పనులకు అంతరాయం కలుగుతోందని మరో వ్యాపారి వాపోయారు. తమ దగ్గర వెంటనే  బ్యాంకింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించాలని  కోరారు.
అయితే  రైతుల, ఇతర వ్యాపారుల కష్టాల నేపథ్యంలో  జాతీయ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు మార్కెట్  కార్యదర్శి రవి  కుమార్ తెలిపారు. కోలార్  మార్కెట్ లో ఉన్న డీసీసీ బ్యాంకు గత ఎనిమిది నెలలగా పనిచేయడం లేదని చెప్పారు.
దీనిపై కర్ణాటక వ్యవసాయం మంత్రి   కృష్ణ బైర్ గౌడ్  స్పందించారు. త్వరలోనే  బ్యాంక్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.  డీమానిటైజేసన్ పై  ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి ముఖ్యంగా అగ్రి వస్తువుల వర్తకంలో  నగదు కొరత ఏర్పడిందన్నారు.  రాష్ట్రంలో  ఏపీఎంసీఎస్ (అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ)  పరిధి అంతటా 35 శాతం ప్రభావితం మయిందని తెలిపారు.

కాగా కోలార్  మార్కెట్ సంవత్సరానికి  సుమారు 1.5 లక్షల టన్నుల వ్యాపారాన్ని చేస్తుంది.  బిహార్, బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, పంజాబ్ , మధ్య ప్రదేశ్, డిల్లీ,  ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, రాష్ట్రాలతో్ సహా బంగ్లాదేశ్, పాకిస్తాన్, దుబాయ్ దేశాలకు విమానాల ద్వారా టమాటాను  ఎగుమతి చేస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement