has
-
అతిపెద్ద టమాటా మార్కెట్‌ను తాకిన నోటు దెబ్బ
బెంగళూరు: డీమానిటేజేషన్ కష్టాలు కోలార్ టమోటా మార్కెట్ ను భారీగా తాకాయి. ఒకవైపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, మరోవైపు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు, రవాణా ఎజెంట్లు, ట్రక్ డ్రైవర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఆసియాలోని రెండవ అతిపెద్ద టమోటా మార్కెట్ గా పేరుగాంచిన కోలార్ మార్కెట్ యార్డ్ లో ఒక్క బ్యాంకు గానీ, ఏటీఎం సెంటర్ గానీ లేకపోవడం ఆందోళనగా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని కోలార్ లోని టమాటా మార్కెట్ దేశంలో అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది. పింపాల్ గాన్, నాసిక్ తర్వాత దక్షిణ భారతదేశం అతి పెద్దదైన కోలార్ ..కర్ణాటక రాజధాని బెంగళూరుకు కేవలం 70 కి.మీ ల దూరంలో ఉంది. అయితే ఇక్కడ ఉన్న బ్యాంకు పనిచేయక, సమీపంలో ఎలాంటి బ్యాంకు గానీ, ఏటీఎం సెంటర్ గానీ లేక ఇక్కడి వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దిగుబడి బాగా వచ్చినా, సరిపడినంత డిమాండ్ ఉన్నా వ్యాపారం చేసుకోలేని పరిస్థితి దాపురించిందని వ్యాపారి మునియప్ప చెప్పారు. ఇంకా పాతనోట్లతోనే వ్యాపారం చేస్తున్నామనీ, వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం పెద్ద సమస్యగా మారిందన్నారు. దీంతో తమ సిబ్బంది వేతనాల చెల్లింపు ఆలస్యం కానుందన్నారు. రైతులు నగదు చెల్లింపులకోసం ఒత్తిడి చేస్తున్నారనీ, చెక్ లను అంగీకరించడం లేదన్నారు. దీంతో తమకు నగదు కొరత ఏర్పడిందన్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటీఎం కేంద్రం క్యూలో తమ కూలీలు ఎక్కువసేపు నిలబడ్డ మూలంగా పనులకు అంతరాయం కలుగుతోందని మరో వ్యాపారి వాపోయారు. తమ దగ్గర వెంటనే బ్యాంకింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. అయితే రైతుల, ఇతర వ్యాపారుల కష్టాల నేపథ్యంలో జాతీయ బ్యాంకు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి రవి కుమార్ తెలిపారు. కోలార్ మార్కెట్ లో ఉన్న డీసీసీ బ్యాంకు గత ఎనిమిది నెలలగా పనిచేయడం లేదని చెప్పారు. దీనిపై కర్ణాటక వ్యవసాయం మంత్రి కృష్ణ బైర్ గౌడ్ స్పందించారు. త్వరలోనే బ్యాంక్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. డీమానిటైజేసన్ పై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి ముఖ్యంగా అగ్రి వస్తువుల వర్తకంలో నగదు కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఏపీఎంసీఎస్ (అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) పరిధి అంతటా 35 శాతం ప్రభావితం మయిందని తెలిపారు. కాగా కోలార్ మార్కెట్ సంవత్సరానికి సుమారు 1.5 లక్షల టన్నుల వ్యాపారాన్ని చేస్తుంది. బిహార్, బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, పంజాబ్ , మధ్య ప్రదేశ్, డిల్లీ, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, రాష్ట్రాలతో్ సహా బంగ్లాదేశ్, పాకిస్తాన్, దుబాయ్ దేశాలకు విమానాల ద్వారా టమాటాను ఎగుమతి చేస్తుంది. -
ఎన్ని నోట్లు రెడీ అవుతున్నాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రత్నామ్నాయ నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు మూడు ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా రోజుకి మిలియన్ల కొద్దీ కరెన్సీని ముద్రిస్తోంది. తద్వారా తగినంత కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా బీఆర్బీఎన్ఎంపీఎల్ (భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ ) ద్వారా (18లైన్లు) సుమారు 4కోట్లు( 40 మిలియన్ల)రూ.2 వేల నోట్లను ముద్రిస్తోంది. అలాగే బీఎన్పీ దివస్ (బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ (3లైన్లు) లో 90 లక్షల రూ.500 నోట్లను రడీ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే నాసిక్ ప్రెస్ లోని నాలుగు లైన్ల ద్వారా సుమారు కోటి 80 లక్షల( (18మిలియన్లు) కరెన్సీ నోట్లను ముదిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నాసిక్ లోని ప్రెస్ (1లైన్) ద్వారా రోజుకు ముఖ్యంగా 50 లక్షల రూ. 20 రూపాయల నోట్ల ను ముద్రిస్తోంది. అలాగే (2లైన్లు) కోటి(10 మిలియన్ల) రూ.100 నోట్లును ముద్రిస్తోంది. తగినంత కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరోసా ఇచ్చింది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా తొమ్మిదో రోజుకూడా ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు రద్దుచేసిన రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడి పరిమితిని గురువారం రూ2వేలకు కుదించింది ప్రభుత్వం. మరోవైపు పార్లమెంట్ లో ప్రతిపక్షాల నిరసనల సెగ రేగిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు అసలు భారత్ వచ్చే ఉద్దేశం లేదు
-
మాల్యాకు అసలు భారత్ వచ్చే ఉద్దేశం లేదు
న్యూఢిల్లీ: మద్యంవ్యాపారి, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి విజయ్ మాల్యాపై ఢిల్లీ పటియాలా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఫెరా ఉల్లంఘన కేసులో సమన్లను తిరస్కరించడంపై , నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. అసలు మాల్యాకు దేశానికి తిరిగి ఇచ్చే ఉద్దేశమే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకు భారత్ రావాలని ఉన్నా పాస్ పోర్టు రద్దయిందంటూ కపటనాటకం ఆడుతున్నాడని, ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నాడని కోర్టు పేర్కొంది. ఇప్పటికే పలుసార్లు ఆదేశాలు జారీ చేశామని, మాల్యాకు భారతీయ చట్టాలపై గౌరవం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది . కాగా 17 బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలను బాకీ పడి బ్రిటన్ కు పారిపోయిన మాల్యా ఆస్తులను ఈడీ కేసులు నమోదు చేసింది. ఇటీవల సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేసింది. 2012లో చెక్‌బౌన్స్ కేసులో మాల్యాకు మరో ఎన్బీడబ్యూ జారీ చేసింది. తాజాగా ఆగస్ట్ 23న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, మాల్యాపై మరో కేసు నమోదు చేసింది. -
ముద్రగడను విమర్శించే అర్హత ఎవరికీ లేదు
స్థాయి మరిచి మాట్లాడితే జాతి చూస్తూ ఊరుకోదు సత్రం భూములు కాజేసిన చరిత్ర మీది కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయకు కాపు జేఏసీ హెచ్చరిక కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే అర్హత రాష్ట్రంలో ఏ ఒక్కరికీ లేదని కాపు జేఏసీ నాయకులు సృష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముద్రగడ ఒక్కరేనని వారన్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఏసీ నాయకుల సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కాపు సద్భావనా సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, తోట రాజీవ్, కల్వకొలను తాతాజీ, గౌతు స్వామి, బోడసకుర్రు దత్తుడు తదితరులు మాట్లాడారు. ముద్రగడపై కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అవాకులు, చెవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండించారు. సత్రం భూములు కాజేసిన చరిత్ర ఆయనదని, స్థాయి మరిచి మాట్లాడితే జాతి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జాతి కోసం 1994లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కుటుంబ సమేతంగా ప్రాణ త్యాగానికి సిద్ధపడి కాపుల కోసం జీఓ నంబర్ 30 సాధించిన ఘనత ముద్రగడదని గుర్తు చేశారు. యావత్తు కాపు జాతీ ముద్రగడ వెంటే ఉంటుందన్నారు. దొంగ దీక్షలు చే యాల్సిన అవసరం ముద్రగడకు లేదన్నారు. ప్రభుత్వం నిర్బంధించినా 14 రోజుల పాటు ఏ విధంగా దీక్ష చేశారో కాపు జాతికే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. దొంగ హామీ లిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ముద్రగడ ఉద్యమం చేట్టకపోతే కాపు కార్పొరేషన్ లేదు, రామానుజయకు ఆ పదవీ రాదన్నారు.