న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనులకు సంబంధించిన కూలీ డబ్బులను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని మరింత మెరుగ్గా, పారదర్శకంగా అమలు చేసేందుకు, ఈ ప్రక్రియలో రాష్ట్రాలకు మరింత సాధికారత కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉపాధి హామీ నిధులు మొదట రాష్ట్రాల ఉపాధి హామీ నిధికి, అక్కడి నుంచి కార్మికుల ఖాత్లాలోకి పే ఆర్డర్ విడుదలైన మర్నాడే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.
కాగా, న్యాయవాదుల స్థాయి నుంచి హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి పొందినవారికి పెన్షన్ ప్రయోజనాల్లో తేడాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ఇతర ఇతర నిర్ణయాలు..
* మధ్యవర్తిత్వ చట్ట సవరణలకు ఉద్దేశిం చిన ప్రతిపాదనకు ఆమోదం. 18 నెలల్లో గా కేసులను పరిష్కరించాలనే ప్రతిపాదనను ఇందులో పొందుపర్చారు.
* డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ‘సెంటర్ ఫర్ వరల్డ్ నేచురల్ హెరిటేజ్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఆసియా- పసిఫిక్ రీజియన్’ను ఏర్పాటు చేసేందుకు యునెస్కోతో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనకు అంగీకారం.
కూలీల ఖాతాల్లోకే ‘ఉపాధి’ డబ్బు
Published Thu, Aug 6 2015 12:43 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement