అలహాబాద్ హైకోర్టు ఆదేశం
అలహాబాద్: ప్రభుత్వోద్యోగులు, ప్రజాప్రతినిధుల పిల్లలను పదో తరగతి దాకా తప్పనిసరిగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు అందుకుంటున్న వారందరికీ(జడ్జీలు సహా) ఇది వర్తిస్తుందని పేర్కొంది. సెంకడరీ ఎడ్యుకేషన్ బోర్డు నడిపే స్కూళ్లలో టీచర్ల నియామకం సరిగా లేదని దాఖలైన వ్యాజ్యంలో జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఎవరైనా ప్రైవేటు స్కూళ్లకు పిల్లల్ని పంపుతుంటే వారు ఎంత ఫీజు రూపంలో చెల్లిస్తున్నారో అంత మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమచేయాలనే నిబంధన పెట్టాలన్నారు. నేతల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటే, టీచర్ల నియామకంపై నిరక్ష్యం ప్రదర్శించేవారు కారని అన్నారు.
నేతల, అధికారుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపాలి
Published Wed, Aug 19 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement
Advertisement