ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు శుక్రవారం లోక్సభలో నినాదాలు చేశారు. అనంతరం వారంతా స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ మీరాకుమార్ వారిని ఎంత వారించి వినకపోవడంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
అయితే గతంలో ఇదే అంశంపై12 మంది సీమాంధ్ర సభ్యుల్లో ఐదుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. గతనెల 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తు సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే.