లండన్‌లో మళ్లీ ఉగ్రదాడి | London mosque attack: blood on the streets of Britain again as revenge feared | Sakshi
Sakshi News home page

లండన్‌లో మళ్లీ ఉగ్రదాడి

Published Tue, Jun 20 2017 2:37 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

లండన్‌లో మళ్లీ ఉగ్రదాడి

లండన్‌లో మళ్లీ ఉగ్రదాడి

మసీదు వద్ద పాదచారులపై దూసుకెళ్లిన వ్యాన్‌
ఒకరి మృతి, 10 మందికి గాయాలు.. ‘వ్యాన్‌’ దుండగుడి అరెస్ట్‌


లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌ మళ్లీ ఉగ్రవాద దాడితో ఉలిక్కిపడింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక సెవెన్‌ సిస్టర్స్‌ రోడ్డులోని మసీదు వెలుపల భక్తులపైనుంచి ఓ వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. వ్యాన్‌ నడిపిన దుండగుడిని అరెస్ట్‌ చేశారు. బ్రిటన్‌లో గత నాలుగు నెలల్లో ఇది నాలుగో ఉగ్రదాడి. సెవెన్‌ సిస్టర్స్‌ రోడ్డులోని ముస్లిం వెల్ఫేర్‌ హౌస్‌లో  భక్తులు రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని బయటకి వస్తుండగా ఒక వ్యక్తి కిందపడిపోయాడు.

 కొందరు అతనికి ప్రథమ చికిత్స చేస్తుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్‌  పేవ్‌మెంట్‌ ఎక్కి పాదచారులపై నుంచి దూసుకెళ్లింది. అప్పటికే కిందపడిపోయిన వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అతడు వ్యాన్‌దాడిలోనే చనిపోయాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. నిందితుణ్ని వేల్స్‌లోని కార్డిఫ్‌లో నివసిస్తున్న డారెన్‌ ఆస్బర్న్‌(47) అనే వ్యక్తిగా గుర్తించారు. అతనికి నలుగురు పిల్లలున్నారు.  

ముస్లింలందర్నీ చంపుతా: దుండగుడు
‘నేను ముస్లింలందర్నీ చంపుతాను’ అని దుండగుడుఅరిచినట్లు అతనికి దేహశుద్ధి చేసిన అబ్దుల్‌ రెహమాన్‌ అనే వ్యక్తి తెలిపాడు. దుండగుడిని కొట్టొద్దని ఇమామ్‌ ప్రజలను వారించారు. ‘నేను చేయాల్సిన పని చేశాను’ అని దుండగుడు ఇమామ్‌తో చెప్పాడు. నిందితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  వ్యాన్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని కొందరు చెప్పగా పోలీసులు తోసిపుచ్చారు. దాడి హేయమైన ఉగ్రవాద చర్య అని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు.  ఆమె ఘటనాస్థలికి దగ్గర్లోని ఫిన్స్‌బరీ మసీదును సందర్శించారు.

మాలిలో ఉగ్ర పంజా
బమాకో: పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని మాలి రాజధాని బమాకోలో ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు ఆ దేశ సైనికుడు కాగా, మిగిలిన ఐదుగురు విదేశీ పర్యాటకులు. మరో 14 మంది గాయపడ్డారు. ఆది వారం మధ్యాహ్నం బమాకో శివారు ప్రాంతంలోని కంగబా లే క్యాంపెమెంట్‌ రిసార్ట్‌పై కొందరు దుండగులు పర్యాట కులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన ట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నలుగు రు దుండగులు ఆయుధాలతో ‘అల్లాహో అక్బర్‌’ అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చి కాల్పులకు తెగబడ్డారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement