మాల్యా జెట్ రీ ఆక్షన్ కు కోర్టు అనుమతి
ముంబై: వేలకోట్ల రుణ ఎగవేత దారుడు , వ్యాపార వేత్త విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ విమానం మరోసారి వేలం వేసేందుకు బాంబే హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ బస్ 319 లగ్జూరియస్ విమానాన్ని గత వేలంలో రూ.27.39 కోట్లకు గెలుచుకున్న ఎస్‌జీఐ కామెక్స్ సంస్థ తాజా వేలాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. తమ బిడ్‌ను ఉపసంహరించుకుని, తిరిగి వేలం నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఎస్జీఐ బాంబే హైకోర్టును కోరింది. దీన్ని విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతిని మంజూరు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 6 కు వాయిదా వేసింది.
బిడ్ గెలుచుకున్న ఎస్‌జీఐ కామెక్స్ సంస్థ ..2012 అక్టోబరు నుంచీ తమకు హ్యాంగర్ చార్జీలు చెల్లించాలని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్) హైకోర్టును కోరింది.దీంతో ఈ వేలం ప్రక్రియ నుంచి ఉపసంహరించుకునే వీలు కల్పించాలని ఎస్‌జీఐ కామెక్స్ కోర్టును అభ్యర్థించింది. ఫ్రెష్ గా మరోసారి వేలం నిర్వహించాలని, అవసరమైతే మళ్లీ బిడ్ వేస్తామని ఆ సంస్థ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌సీ ధర్మాధికారి నేతృత్వంలోని బెంచ్ ఇందుకు అంగీకరించింది. దీంతోపాటుగా వేలం నిర్వహణలో నిపుణులైన, ప్రభుత్వ, లేదా ఇతర సంస్థల కంట్రోల్ లేని స్వతంత్ర ఏజెన్సీ సహాయంతో ఈ వేలం నిర్వహించాలని కోరింది. తదుపరి విచారణ సమయానికి కొత్త ఏజెన్సీ పేరును ఎస్‌జీఐ వెల్లడి చేయాల్సి ఉంది. మరోవైపు 17బ్యాంకులకురూ.9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టిన కేసులో బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరగనుంది.
కాగా సీజే లీజింగ్ నుంచి మాల్యాకు లీజుకు తీసుకున్నారు. అయితే మాల్యా బకాయి పడిన రూ.500 కోట్ల వసూలు కోసం సేవా పన్ను శాఖ అధికారులు డిసెంబర్, 2013 లో ఈ విమానాన్ని ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే.