ముంబై: ఇక పిల్లలు కలిగే అవకాశం లేకపోవడంతో పాటు భర్త(62)ను భార్య మానసికంగా హింసించిందన్న కారణంతో బాంబే హైకోర్టు ఓ వృద్ధ జంటకు విడాకులు మంజూరు చేసింది. తన భార్య మానసిక వేధింపులకు పాల్పడుతోందని, తమకు పిల్లలు పుట్టే అవకాశం ఇక లేనందున విడాకులు మంజూరు చేయాలని 1995లో ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది.
దీన్ని సవాలు చేస్తూ అతను హైకోర్టును ఆశ్రయించారు. వారిద్దరూ కలిసున్న 20 ఏళ్లలో ఏనాడూ సజావుగా కాపురం చేయలేదని భర్త తరఫు న్యాయవాది వాదించారు. వీరికి 1972లో వివాహం కాగా 1993 నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు. వాదనల అనంతరం వీరిద్దరూ భవిష్యత్తులో కూడా సఖ్యతగా కలసి ఉండే అవకాశం లేనందున విడాకులు ఇవ్వడం సబబేనని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment