అనుమానంతో భార్య.. ముగ్గురు పిల్లల దారుణహత్య | Man kills wife, 3 children in Narnaul | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్య.. ముగ్గురు పిల్లల దారుణహత్య

Published Thu, Mar 23 2017 7:18 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

Man kills wife, 3 children in Narnaul

కట్టుకున్న భార్యకు తన తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ఆమెతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా చంపేశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన హరియాణాలోని షెహబజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అతడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. రాధేశ్యామ్ అనే ఈ నిందితుడు ముందుగా తన కూతుళ్లిద్దరినీ, కొడుకును ఒక నీళ్ల ట్యాంకులోకి తోసేసి, దానికి బయట నుంచి మూత పెట్టేశాడు.

తర్వాత ఇంట్లో వంట చేస్తున్న భార్య మంజు (33) వద్దకు వెళ్లి, ఆమెను పదునైన ఆయుధంతో పీక నరికి చంపేశాడు. హడావుడిగా ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత తాను నూతిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే స్థానికులు అతడిని కాపాడి బయటకు తీయడంతో విషయం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానమే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని ఆస్పత్రిలో చేర్చామని.. అతడి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement