భార్యపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు! | Man pastes wife nude pictures across Karnataka town | Sakshi
Sakshi News home page

భార్యపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు!

Sep 18 2015 2:55 PM | Updated on Sep 3 2017 9:35 AM

భార్యపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు!

భార్యపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు!

కట్టుకున్న భార్య తనను కాదని వెళ్లిపోయిందనే అక్కసుతో ఓ వృద్ధుడు నీచపు పనికి పాల్పడ్డాడు.

బెంగళూరు: కట్టుకున్న భార్య తనను కాదని వెళ్లిపోయిందనే అక్కసుతో ఓ వృద్ధుడు నీచపు పనికి పాల్పడ్డాడు. భార్యపై కోపంతో ఆమె నగ్నచిత్రాలను ఊరంతా అతికించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఈ ఘటన వివరాలు...

కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్)కు చెందిన వెంకటప్ప(65)కు ఇద్దరు భార్యలు. రెండో పెళ్లిచేసుకున్న వెంకటప్పతో మొదటి భార్య తరచుగా గొడవపడేది. రెండో భార్యను వదిలేసి రావాలని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినలేదు. దీంతో విసిగిపోయిన మొదటి భార్య తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్యను వదిలించుకుంటేనే కాపురానికి వస్తానని అందరిలో కడిగిపారేసింది.

దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన వెంకటప్ప ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. తాము ఏకాంతంగా గడిపిన ఫోటోలతో పోస్టర్లు ముద్రించి ఊరంతా అతికించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఊరంతా అతికించిన పోస్టర్లను బాధితురాలి బంధువులు చించేసి మంటల్లో వేశారు. వెంకటప్ప రెండో భార్య, పోస్టర్లు ముద్రించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలిసిన వారంతా వెంకటప్ప.. ఇదేందప్పా అంటూ ముక్కున వేలేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement