Kolar Gold Fields
-
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
1,744 కోట్ల ఆస్తి.. రహస్య వ్యాపారాలు లేవు
బెంగళూరు: తన వ్యాపారాలన్నీ చట్టబద్ధమైనవని, తనకు ఎటువంటి రహస్య వ్యాపారాలు లేవని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు యూసుఫ్ షరీఫ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,744 కోట్ల ఆస్తులు ఉన్నట్టు నామినేషన్ డిక్లరేషన్‌లో వెల్లడించారు. పాత సామాను వ్యాపారంతో మొదలు పెట్టిన యూసుఫ్ షరీఫ్ అంచెలంచెలు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 3 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పిస్తానని షరీఫ్ హామీయిచ్చారు. ‘జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. చట్టబద్దంగా వ్యాపారాలు చేస్తున్నాను. నిబంధనల ప్రకారం పన్ను చెల్లిస్తున్నాను. నా ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన డిక్లరేషన్‌లో పొందుపరిచాను. నా స్నేహితులు, నియోజకవర్గం, గ్రామం, బెంగళూరు కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. మా 6 నియోజకవర్గాల్లోని 3 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించాలని అనుకుంటున్నాను’ అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. (చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే) కేజీఎఫ్ బాబు.. యూసుఫ్ షరీఫ్.. కర్ణాటకలో కేజీఎఫ్ బాబుగా పాపులరయ్యారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) కేంద్రంగా చాలా కాలం పాటు పాత సామాను వ్యాపారం చేశారు. ఈ బిజినెస్ బాగా కలిసిరావడంతో ‘కేజీఎఫ్ బాబు’గా ఆయన ప్రసిద్ధి చెందారు. తర్వాత కాలంలో బెంగళూరు కేంద్రంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి వేల కోట్లకు పడగెత్తారు. ‘కేజీఎఫ్ బాబు’కు ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే మూడు లగ్జరీ కార్లు తన వద్ద ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. (చదవండి: భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’) -
కేజీఎఫ్ గనుల్లో పసిడిని మించిన లోహం
సాక్షి, బెంగళూరు : కేజీఎఫ్‌లోని బిజిఎంఎల్ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటి వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కోలారు జిల్లా ప్రజలకు తీపి కబురు అందిస్తుందని లోక్‌సభ సభ్యుడు ఎస్.మునిస్వామి తెలిపారు. మంగళవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిజిఎంఎల్ పునరుజ్జీవనానికి సంబంధించి గని కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు. ఆ సమయంలో ప్రధాని సూచనల మేరకు కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలో ఒక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి బిజిఎంఎల్‌ను సందర్శించి బంగారు నిక్షేపాల నమూనాలను ల్యాబొరేటరికి పంపిన సమయంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తరహాలో ఈ గనులను పునః ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాలలో తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని తెలిపారు. 2022లో రైల్వే వర్క్‌షాప్ బిజిఎంఎల్‌కు చెందిన 12600 ఎకరాల ప్రాంతాన్ని ఎస్ఇజెడ్గా ప్రకటించడానికి 1000 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సోలార్ ఉపకరణాల తయారీకి ఇప్పటికే సర్వే ప్రారంభించిందని ఎంపీ తెలిపారు. శ్రీనివాసపురంలో రూ.485 కోట్ల వ్యయంతో రైల్వే వర్క్‌షాపును 2022 లోగా ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని రైల్వే అధికారులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతానికి కృష్ణా నది నీటిని అందించే పథకానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలలోగా దీనిని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి నాగేష్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రవి కుమార్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బి పి వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు. పల్లాడియం అంటే ప్లాటినం గ్రూపు లోహాలకు చెందిన ఇది వెండి రంగులో ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతకే కరుగుతుంది. ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తున్నందున అరుదైన లోహంగా గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నా ప్రపంచ డిమాండుకు సరిపోవడం లేదు. దీని గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే ఎక్కువే. -
ప్రాణాలు తీసిన ‘బంగారు’ కలలు
కుప్పం (చిత్తూరు జిల్లా)/కేజీఎఫ్: చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో బుధవారం రాత్రి ఆరుగురు చోరీకి ప్రయత్నించగా వారిలో ముగ్గురు మృతి చెందారు. కేజీఎఫ్ పదేళ్ల క్రితం మూతపడింది. అప్పటి నుంచి బంగారు గనుల్లో పనులు జరగకపోవడంతో భద్రతా సిబ్బందిని నియమించారు. గనుల్లో బుధవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు చోరీ యత్నానికి పాల్పడ్డారు. రాత్రి వేళల్లో బంగారు ఖనిజాలు కనిపిస్తాయని అపోహతో కేజీఎఫ్‌కు చెందిన జోసెఫ్ డిసౌజా (35), పడియప్ప (22), కంద (50), విక్టర్, కార్తీక్, రిచర్డ్‌లు గనుల్లోపలికి ప్రవేశించారు. వీరిలో ఊపిరాడక జోసెఫ్ డిసోజా, పడియప్ప, కంద మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 20 మందికి పైగా ఫైర్, పోలీసులు బుధవారం రాత్రంతా గాలించి 400 అడుగుల లోతున ఉన్న కంద, జోసెఫ్ డిసౌజా మృతదేహాలను వెలికితీశారు. పడియప్ప మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు కార్తీక్, విక్టర్లను అరెస్టు చేశారు. మరో నిందితుడు రిచర్డ్ పరారీలో ఉన్నాడు. మృతులు జోసెఫ్, పడియప్ప, కంద -
మిగతా ఇండస్ట్రీలకు పోటీగా పోరాడుతున్నాం
‘‘ఈ చిత్రం ట్రైలర్ గ్రాండ్‌గా ఉంది. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి పెంచేలా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్, ప్రొడ్యూసర్ విజయ్‌కు అభినందనలు’’ అన్నారు కన్నడ నటుడు అంబరీష్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘కేజీఎఫ్’ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్‌ని బెంగళూరులో విడుదల చేశారు. కన్నడ ట్రైలర్ విడుదల చేసిన సీనియర్ నటుడు అంబరీష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. తమిళంలో 5 కోట్ల బడ్జెట్‌తో ఒక్కపాట తీస్తుంటారు. మేం (కన్నడ) 5 సినిమాలు తీస్తాం. మిగతా ఇండస్ట్రీలకు పోటీగా కన్నడ ఇండస్ట్రీ ప్రాముఖ్యత కోసం పోరాడుతున్నాం. ఆ పోరాట పటిమ నాకు ఇష్టం. చరిత్రను రాసిన రాజ్‌కుమార్‌గారి పోస్టర్ ఒక్కటి కూడా కర్ణాటక సెంటర్లో చూడలేం. అది మా దురదృష్టం. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అవుతుందనుకుంటున్నాను ’’ అన్నారు. ‘‘ రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాలో ప్రశాంత్ పేరు గుర్తుండి పోతుంది. నిర్మాత ఈ సినిమాకి అసలు హీరో. ఆయన లేకుంటే ఇంత భారీగా తెరకెక్కేది కాదు. కొన్ని క్లిప్పింగ్స్ చూసి ఈ సినిమాను ఆయా భాషల్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చిన విశాల్, సాయికొర్రపాటి, అనిల్ తాండన్‌కు థ్యాంక్స్. అలాగే బాలీవుడ్ స్టార్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లకు కూడా థ్యాంక్స్. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది’’ అన్నారు యష్. ‘‘నేను బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్లి నిర్మాతగా మారాను. ఈ సినిమాతో కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో మా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సాయి కొర్రపాటి. విశాల్ మాట్లాడుతూ.. ‘యష్ నాకు సోదరుడితో సమానం. ‘కేజీఎఫ్’తో కన్నడ సినిమా.. ప్యాన్ ఇండియా మూవీగా నిలుస్తుంది. భాషా పరమైన సరిహద్దులను ఈ సినిమా చెరిపేస్తుంది. ‘బాహుబలి’తో ఇది వరకే ఈ విషయం నిరూపితమైంది. ఇప్పుడు ‘కేజీఎఫ్’తో మారోసారి రుజువుకాబోతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి’’ అన్నారు. అనిల్ తాండన్ మాట్లాడుతూ– ‘‘బాహుబలి, రోబో’ లాంటి భారీ సినిమాల తర్వాత విడుదల చేస్తున్న సౌతిండియన్ మూవీ ఇది. ఇది కూడా భారీ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా ‘ఉగ్రం’. ఆ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు హిట్ అవుతుందో లేదో అనుకున్నాను. చాలా పెద్ద హిట్ అయింది. దాంతో నాకు నమ్మకం కుదిరింది. అదే నమ్మకంతో నిర్మాత విజయ్ గారు ‘కేజీఎఫ్’ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నా 4ఏళ్ల కల సాకారమైంది’’ అన్నారు డైరెక్టర్ ప్రశాంత్. ‘‘అందరూ ఈ సినిమా బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు.. నాకు డబ్బు ముఖ్యం కాదు.. బంధాలే ముఖ్యం. కొత్త టాలెంట్ బయటకు రావాలనే ఆలోచనతో చేసిన చిత్రమిది. ప్రశాంత్ అద్భుతమైన డైరెక్టర్. యష్ నా తమ్ముడి లాంటి వాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. నిర్మాతగా ఇది నాకో గొప్ప చిత్రం అవుతుంది’’ అన్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు కన్నడ సూపర్‌స్టార్ పునిత్ రాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లు వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. -
భార్యపై ప్రతీకారం అలా తీర్చుకున్నాడు!
బెంగళూరు: కట్టుకున్న భార్య తనను కాదని వెళ్లిపోయిందనే అక్కసుతో ఓ వృద్ధుడు నీచపు పనికి పాల్పడ్డాడు. భార్యపై కోపంతో ఆమె నగ్నచిత్రాలను ఊరంతా అతికించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఈ ఘటన వివరాలు... కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్)కు చెందిన వెంకటప్ప(65)కు ఇద్దరు భార్యలు. రెండో పెళ్లిచేసుకున్న వెంకటప్పతో మొదటి భార్య తరచుగా గొడవపడేది. రెండో భార్యను వదిలేసి రావాలని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినలేదు. దీంతో విసిగిపోయిన మొదటి భార్య తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్యను వదిలించుకుంటేనే కాపురానికి వస్తానని అందరిలో కడిగిపారేసింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన వెంకటప్ప ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. తాము ఏకాంతంగా గడిపిన ఫోటోలతో పోస్టర్లు ముద్రించి ఊరంతా అతికించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఊరంతా అతికించిన పోస్టర్లను బాధితురాలి బంధువులు చించేసి మంటల్లో వేశారు. వెంకటప్ప రెండో భార్య, పోస్టర్లు ముద్రించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలిసిన వారంతా వెంకటప్ప.. ఇదేందప్పా అంటూ ముక్కున వేలేసుకున్నారు.