
గర్ల్ ఫ్రెండ్ కోసం కాల్చేశాడు!
సాధారణంగా గర్ల్ ఫ్రెండ్(స్నేహితులరాలి )గురించి ఘర్షణలు చోటుచేసుకోవడం చాలానే చూస్తూ ఉంటాం.
గుర్గావ్: సాధారణంగా గర్ల్ ఫ్రెండ్ (స్నేహితులరాలి )గురించి ఘర్షణలు చోటుచేసుకోవడం చాలానే చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ప్రేయసి కోసం ఎంతటి నిర్వాకానికైనా ఒడిగడుతుంటారు. ఈ తరహా ఘటనే గుర్గావ్ లో ఆదివారం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువతిని ప్రదీప్ కుమార్ అనే దగ్గర బంధువు ఇష్టపడుతున్నాడనే కారణంతో లలిత్ (27) అనే వ్యక్తి దారుణంగా కాల్చి చంపేశాడు. వీరిద్దరికీ గతంలోనే వివాహం జరిగినా..ఒక స్నేహితురాలి విషయంలో దాడి చేసుకున్నారు. తొలుత వారి మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం కాస్తా తీవ్రం రూపం దాల్చడంతో కుమార్ ను లలిత్ తన వద్ద నున్ననాటు తుపాకీతో కాల్చేశాడని పోలీసులు తెలిపారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ ఘటనలో మృత్యువాత పడ్డ కుమార్ అలియాస్ ఫిల్మీ-లలిత్ లు ఇద్దరూ దగ్గర బంధువులేనని.. ఈ క్రమంలోనే నిన్న ఒక పుట్టినరోజు పార్టీకి హాజరైన వీరి మధ్య ఒక అమ్మాయి గురించి తగాదా జరిగిందన్నారు. అక్కడ వారిద్దరూ ఆ అమ్మాయి తనదంటే తనదని ఒకరికొకరు హెచ్చరించుకున్నారని, ఆ సమయంలోనే లలిత్ తన సహచరుడు కుమార్ పై దాడి చేసి అతని మరణానికి కారణమైయ్యాడని పోలీసులు తెలిపారు. కుమార్ పై లలిత్ తో పాటు, అతని స్నేహితుడు హర్లూ కూడా దాడి చేశాడని తెలిపారు. వీరిద్దరి గతంలోనే వివాహం జరిగినట్లు తమ వద్ద ఉన్న రికార్డుల్లో ఉందన్నారు. గతంలో ఆ ఇద్దరిపైనా అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారి తజ్వీర్ సింగ్ తెలిపారు.