భార్యను చంపబోయి.. జేబులో బాంబు పేలి భర్త మృతి | man wants to kill wife, dies as crude bomb explodes in pocket | Sakshi
Sakshi News home page

భార్యను చంపబోయి.. జేబులో బాంబు పేలి భర్త మృతి

Published Sat, Oct 25 2014 8:25 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

తనను వదిలిపెట్టి వెళ్లిపోయిన భార్యను చంపడానికి జేబులో నాటు బాంబులు పెట్టుకుని బయల్దేరాడో వ్యక్తి. అయితే.. దారిలోనే ఆ బాంబులు కాస్తా పేలిపోవడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

తనను వదిలిపెట్టి వెళ్లిపోయిన భార్యను చంపడానికి జేబులో నాటు బాంబులు పెట్టుకుని బయల్దేరాడో వ్యక్తి. అయితే.. దారిలోనే ఆ బాంబులు కాస్తా పేలిపోవడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ సమీపంలో జరిగింది.

తన భార్య షాలినిని చంపాలని వినయ్ కుమార్ అనే వ్యక్తి దేవ్కలి గ్రామానికి వెళ్లాడు. ఆమె ఇంటి మీద రెండు బాంబులు విసిరాడు. వాటిలో ఒకటి ఇంటి గోడను తాకింది. మరొకటి పేలలేదు. దాంతో షాలిని కుటుంబ సభ్యులు అతడిని వెంటాడారు. పరుగు పెడుతున్న అతడు కింద పడిపోవడంతో జేబులో ఉన్న మరో నాటుబాంబు పేలిపోయింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement