
యు తిన్ సేన్‌తో మన్మోహన్ సమావేశం
నేప్యీదే : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మయన్మార్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మయన్మార్ అధ్యక్షుడు యు తిన్ సేన్‌తో ఆ దేశ రాజధాని నేపిదాలో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. బింస్టెక్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మయన్మార్ వెళ్లిన ప్రధాని పర్యటనలో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్ దేశాధినేతలతోనూ సమావేశమౌతారు.