జార్ఖండ్: జార్ఖండ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. కొత్తగా నిర్మిస్తున్న రెండు ప్రభుత్వ భవనాలను మూకుమ్మడిగా వచ్చి పేల్చిపారేశారు. ఈ ఘటన గిరిదిహ్ జిల్లాలోని చైన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దాదాపు 50 మంది మావోయిస్టులు ఒకేసారి వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని ప్రభుత్వాధికారులు తెలిపారు.
ఓ మూడంతస్తుల భవనాన్ని, మరో రెండంతస్తుల భవనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. సెరికల్చర్ కోసం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకోసం వీటిని నిర్మించారు. అయితే, దీనిని నిర్మించిన కాంట్రాక్టర్లు తాము డిమాండ్ చేసినట్లుగా డబ్బు ఇవ్వలేదని కోపంతోనే మావోయిస్టులు ఈ పనిచేసినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
భవనాలు పేల్చిన మావోయిస్టులు
Published Fri, Jul 10 2015 8:40 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement
Advertisement