జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు మావోయిస్టు గ్రూపుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
రాంచీ : జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు మావోయిస్టు గ్రూపుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పలమౌ జిల్లా కౌర్య గ్రామ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎంసీసీ, టీపీసీ గ్రూపుల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ...మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.