చింతూరు: ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని చింతూరు మండలం మల్లంపేట, నర్శింగపేట గ్రామాల మధ్య మంగళవారం మావోయిస్టు అమరవీరుల స్తూపం వెలిసింది. (దీనిని కర్రలతో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు). అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు.. ఉద్యమంలో అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించాలంటూ స్థూపం చుట్టూ పోస్టర్లు ఏర్పాటుచేశారు. వారోత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొనగా.. తాజాగా ఈ స్తూపం ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. డెత్‌స్పాట్‌కు సమీపంలోనే మావోయిస్టులు ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయడంతో మల్లంపేట, నర్శింగపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ల నెపంతో హతమార్చిన వ్యక్తుల మృతదేహాలను నర్శింగపేట గ్రామ సమీపంలోనే పడేస్తుండడంతో దీనికి డెత్‌స్పాట్‌గా పేరుపడింది. ఇపుడు అక్కడికి సమీపంలోనే ఈ స్తూపాన్ని ఏర్పా టుచేయడం గమనార్హం. కాగా, వరంగల్ జిల్లా చిట్యాల మం డలం రామకృష్టాపూర్‌లో సోమవారం రాత్రి సీపీఐఎంఎల్ మావో యిస్టు పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు వారోత్స వాలను జయప్రదం చేయాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.