వాషింగ్టన్: ‘శ్వేతసౌధం’ బరిలో నిలిచే వ్యక్తులెవరో తేల్చే ప్రాథమిక ఎన్నికల పోరు ప్రారంభమైంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల రేసులో ముందంజలో ఉన్న వ్యాపారవేత్త, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు అయోవా రాష్ట్రంలో సోమవారం జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌పై రిపబ్లికన్ పార్టీకే చెందిన అభ్యర్థి, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ అనూహ్య విజయం సాధించారు. ట్రంప్‌కు 24 శాతం, క్రూజ్‌కు 28 శాతం ఓట్లు లభించాయి. మొత్తంగా 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో క్రూజ్ గెలుపొందారు. మరోవైపు అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నడెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అయోవా ప్రాథమిక ఎన్నికల్లో విజయం సాధించారు.
తన పార్టీకి చెందిన వెర్మౌంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 49 శాతం ఓట్లు శాండర్స్‌కు, హిల్లరీకి 50 శాతం ఓట్లు లభించాయి.
అయోవా ‘ప్రాథమికం’లో ట్రంప్ ఓటమి
Published Wed, Feb 3 2016 3:53 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
Advertisement