ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డ్ స్థాయి లాభాల తరువాత ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 3 పాయింట్ల లాభంతో 30,250 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల ఎగిసి 9422 వద్ద బలంగా క్లోజ్ అయ్యాయి. దీంతో సరికొత్త సాంకేతిక స్థాయి వద్ద నిఫ్టీ ముగింసింది. ఆఖరి అరగంటలో మాత్రం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ సెక్టార్లు మంచి లాభాలను గడించగా.. ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ, కేపిటల్ గూడ్స్ రంగాలు నెగిటివ్‌గా ముగిశాయి.
ముఖ్యంగా ఐషర్ మోటార్స్, జీ ఎంటర్ టైన్ మెంట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్ లాభపడగా, ఆయిల్ అండ్ గ్యాస్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండియా బుల్స్ నష్టపోయిన షేర్లలో ఉన్నాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.27పైసలు క్షీణించి రూ.64.36 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 34 నష్టంతో రూ. 27,962వద్ద ఉంది.