ట్రంప్కు ఇండియా షాక్
- పాక్ తో చర్చల్లో అమెరికా మధ్యవర్తిత్వానికి నో
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా ప్రకటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఈ(భారత్-పాక్ చర్చల) విషయంలో డొనాల్డ్ ట్రంపేకాదు, ఏ ఇతర మూడో వ్యక్తి లేదా సంస్థల జోక్యాన్ని సహించబోమంటూ పరోక్షంగా హెచ్చరించింది.
ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం తదితర అంశాల్లో భాగంగా భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించుకోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తద్వారా మూడో వ్యక్తి ప్రమేయాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
భారత్, పాక్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు ట్రంప్ జోక్యం చేసుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హాలే ప్రకటన చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వ తన విధానాన్ని మరోసారి తెలియజేసింది. భారత్-పాక్ మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ పరిపాలన వర్గానికి ఆందోళన ఉన్నదని, సమస్యలను ఎలా పరిష్కరిస్తే బాగుంటుందో ఆ విధంగా ముందుకు వెళ్లాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్లు నిక్కీ హేలీ చెప్పుకొచ్చారు.
(చదవండి: ఇండియా, పాక్ విషయంలో రంగంలోకి ట్రంప్!)