మ్యాక్బుక్ కు పోటీగా ఎంఐ ఫస్ట్ నోట్బుక్
స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో దూసుకుపోతున్న చైనా సంస్థ షియామి పీసీ కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తన మొదటి ల్యాప్ ట్యాప్ ఎంఐ నోట్ బుక్ ఎయిర్ ద్వారా ఎంటర్ అవుతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది. ఫుల్ మెటల్ బాడీతో 12.5, 13.3 అంగుళాలు రెండు వేరియంట్ల ల్యాప్ టాప్ లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా సుమారు రూ. 35,300, రూ. 51,400 గా ఉండనున్నాయి. యాపిల్ ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్టాప్ పోలిస్తే తమ రెండు ఉత్పత్తులు సన్నగా ..బరువు తక్కువగా ఉంటాయని ఎం ఐ చెబుతోంది. రెండు నమూనాల్లోనూ లామినేటెడ్ డిస్ ప్లేతో ఎడ్జ్ టూ ఎడ్జ్ గ్లాస్ ప్రొటెక్షన్ కల్పించినట్టు తెలిపింది. అందుబాటులోకి వస్తున్న ఈ రెండు ల్యాప్ టాప్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లభ్యమవుతున్నాయి. వీటికి లెదర్ స్లీవ్ లు కూడా అందుబాటులోకి తెచ్చింది.
13.3అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్
13.3 ఇంచెస్ డిస్ ప్లే,
ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ , సిక్స్త్ జనరేషన్ కోర్ ఐ 5 ప్రాసెసర్,
5.59 ఎంఎం మందం,
309.6x210.9x148.8ఎంఎం డైమన్షన్స్
8జీబీ, 256జీబీ ఎక్స్ పాండబుల్
9.5 గంటల బ్యాటరీ లైఫ్, డాల్ బీ డిజిటల్ సరౌండ్ సౌండ్
మ్యాక్ బుక్ కంటే 11శాతం తక్కువ బాడీతో తమ నోట్ బుక్ ఉంటుందని కంపెనీ తెలిపింది. మ్యాక్ బుక్ తో పోలిస్తే బరువులో కూడా తక్కువే నని పేర్కొంది. ఎంఐ 1.35 గ్రా. బరువుంటే, మ్యాక్ 14.8 బరువుంటుందని తెలిపింది.
12.5 అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్
ఇంటెల్ కోర్ ఎం 3 ప్రాసెసర్
12.9 ఎంఎం మందం
4జీబీ రాం, 128జీబీ ఎక్స్ పాండబుల్ జీబీ.
టైప్-సి యూఎస్బీ పోర్ట్,
3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ , (నో ఈథర్నెట్ పోర్ట్, ఆప్టికల్ డ్రైవ్)
11.5 గంటల బ్యాటరీ లైఫ్
రెండో ఎస్ఎస్డీ స్లాట్ పాటు, 0.92కేజీ ల మ్యాక్ బుక్ 13.1ఎంఎం మందం కంటే సన్నగా ఉంటుందని, 1.07కేజీల మాత్రమే బరువు ఉంటుందని తెలిపింది.