Mi Notebook Air
-
షావోమి సరికొత్త ల్యాప్టాప్స్ లాంచ్
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి రెండుకొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించిన షావోమీ తాజాగా ఈసిరీస్‌లో భాగంగా రెండు డివైస్‌లను చైనాలో విడుదల చేసింది. 13.3 అంగుళాలు , 15.6-అంగుళాల డిస్ప్లేలతో రెండు డివైస్‌లను ప్రారంభించింది. 8న జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లను, గ్లాస్ టచ్‌ప్యాడ్, బ్యాక్లిట్ కీ బోర్డు ఈ కొత్త ల్యాప్‌టాప్‌ల్లో అమర్చింది. 1. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 620 కార్డు 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ ఫ్రంట్ఫేసింగ్ కెమెరా 40వాట్స్బ్యాటరీ ధర రూ. 41,500 2. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 15.6 అంగుళాల డిస్ప్లే 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా విస్తరించుకునే అవకాశం ధర : సుమారు రూ .35,500 భారతీయ మార్కెట్లో ఈ పరికరాలు ఎపుడు లాంచ్ అయ్యేది ఇంకా ప్రకటించలేదు. -
షావోమి ‘నోట్‌బుక్’లు వస్తున్నాయ్...
చైనాలో ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ఆవిష్కరణ బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్మి ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. అలాగే ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించింది. చైనీయులు ‘రెడ్మి ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ వెబ్సైట్ (మి.కామ్), హోమ్స్టోర్లలో ఆగస్ట్ 6 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ఆగస్ట్ 2 నుంచి అందుబాటులోకి వస్తుంది. రెడ్మి ప్రొ: ఇందులో 5.5 అంగుళాల స్క్రీన్, రెండు రియర్ కెమెరాలు (13 ఎంపీ, 5 ఎంపీ), మీడియాటెక్ హీలియో ఎక్స్25 ప్రాసెసర్, 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ యూఎస్బీ పోర్ట్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3 జీబీ, 4 జీబీ అనే రెండు ర్యామ్ ఆప్షన్లలో లభించనుంది. భారత్‌లో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 15,000గా ఉండొచ్చని అంచనా. నోట్‌బుక్ ఎయిర్: ఇందులో 13.3 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ, జీఫోర్స్ 940 ఎంఎక్స్ గ్రాఫిక్స్ కార్డ్, విండోస్ 10 ఓఎస్, రెండు యూఎస్బీ 3.0 పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ధర రూ. 51,400గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మ్యాక్‌బుక్ కు పోటీగా ఎంఐ ఫస్ట్ నోట్‌బుక్
స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో దూసుకుపోతున్న చైనా సంస్థ షియామి పీసీ కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తన మొదటి ల్యాప్ ట్యాప్ ఎంఐ నోట్ బుక్ ఎయిర్ ద్వారా ఎంటర్ అవుతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది. ఫుల్ మెటల్ బాడీతో 12.5, 13.3 అంగుళాలు రెండు వేరియంట్ల ల్యాప్ టాప్ లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా సుమారు రూ. 35,300, రూ. 51,400 గా ఉండనున్నాయి. యాపిల్ ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్ పోలిస్తే తమ రెండు ఉత్పత్తులు సన్నగా ..బరువు తక్కువగా ఉంటాయని ఎం ఐ చెబుతోంది. రెండు నమూనాల్లోనూ లామినేటెడ్ డిస్ ప్లేతో ఎడ్జ్ టూ ఎడ్జ్ గ్లాస్ ప్రొటెక్షన్ కల్పించినట్టు తెలిపింది. అందుబాటులోకి వస్తున్న ఈ రెండు ల్యాప్ టాప్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లభ్యమవుతున్నాయి. వీటికి లెదర్ స్లీవ్ లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 13.3అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్ 13.3 ఇంచెస్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ , సిక్స్త్ జనరేషన్ కోర్ ఐ 5 ప్రాసెసర్, 5.59 ఎంఎం మందం, 309.6x210.9x148.8ఎంఎం డైమన్షన్స్ 8జీబీ, 256జీబీ ఎక్స్ పాండబుల్ 9.5 గంటల బ్యాటరీ లైఫ్, డాల్ బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ మ్యాక్ బుక్ కంటే 11శాతం తక్కువ బాడీతో తమ నోట్ బుక్ ఉంటుందని కంపెనీ తెలిపింది. మ్యాక్ బుక్ తో పోలిస్తే బరువులో కూడా తక్కువే నని పేర్కొంది. ఎంఐ 1.35 గ్రా. బరువుంటే, మ్యాక్ 14.8 బరువుంటుందని తెలిపింది. 12.5 అంగుళాల మి నోట్ బుక్ ఎయిర్ ఇంటెల్ కోర్ ఎం 3 ప్రాసెసర్ 12.9 ఎంఎం మందం 4జీబీ రాం, 128జీబీ ఎక్స్ పాండబుల్ జీబీ. టైప్-సి యూఎస్బీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ , (నో ఈథర్నెట్ పోర్ట్, ఆప్టికల్ డ్రైవ్) 11.5 గంటల బ్యాటరీ లైఫ్ రెండో ఎస్ఎస్డీ స్లాట్ పాటు, 0.92కేజీ ల మ్యాక్ బుక్ 13.1ఎంఎం మందం కంటే సన్నగా ఉంటుందని, 1.07కేజీల మాత్రమే బరువు ఉంటుందని తెలిపింది.