దురదృష్టవశాత్తు మంత్రినయ్యా!
గ్రామజ్యోతి సభలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు వకీల్ కావాలనే కోరిక ఉండేదని, దురదృష్టవశాత్తు మంత్రినయ్యానని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం బోయినపల్లిలో జరిగిన గ్రామజ్యోతి సభలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే మా సార్ స్ఫూర్తితో తోటి విద్యార్థులను తీసుకుని వెళ్లి పాఠశాలకు వెళ్లే దారిలో కంపచెట్లన్నీ కొట్టా. అప్పుడే నువ్వు లీడర్ అవుతావని మా సార్ అన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యా.' అని అన్నారు. ఎవరి గ్రామం అభివృద్ధికి వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.