మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని ఎంపీలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం ఎం పళ్లంరాజు కోరారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని ఎంపీలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం ఎం పళ్లంరాజు కోరారు. బీహార్లో మధ్యాహ్న భోజనం తిని పలువురు చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఆయనీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీలకు పళ్లంరాజు లేఖ రాశారు.
జిల్లాస్థాయి నిఘా, పర్యవేక్షక కమిటీతో తక్షణమే సమావేశమయి మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించాలని కోరారు. జిల్లా యంత్రాంగంతో కలిసి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎంపీలు ముందుకు రావాలన్నారు. జిల్లా స్థాయి నిఘా కమిటీలో ఎంపీలు సభ్యులుగా ఉంటారని, సీనియర్ ఎంపీ చైర్మన్గా వ్యవహరిస్తారని తెలిపారు.
మధ్యాహ్న భోజనం వండడానికి వినియోగించే సరుకులను పౌరసరఫరాల శాఖ నుంచి అందించేందుకు కృషి చేస్తున్నట్టు పళ్లంరాజు వెల్లడించారు. అలాగే అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అనుసరించిన అత్యవసర వైద్య ప్రణాళికను ఖరారు చేయనున్నట్టు తెలిపారు.