
మోడీ పట్ల ముభావంగా అద్వానీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ, అద్వానీల నడుమ నెలకొన్న లుకలుకలు ఆదివారం రామ్ జెఠ్మలానీ 90వ పుట్టినరోజు వేడుకల్లో బయటపడ్డాయి. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అద్వానీ కినుక వహించిన సంగతి తెలిసిందే. జెఠ్మలానీ పుట్టినరోజు వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. మోడీ గౌరవసూచకంగా అద్వానీకి పాదాభివందనం చేశారు. అయితే, అద్వానీ ముభావంగా స్పందించారు. ఒకరినొకరు ముక్తసరిగా పలకరించుకున్నాక, మోడీ నేరుగా జెఠ్మలానీకి చేరువలో కూర్చున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం కనిపించలేదు.