ఆమెకు 8 గంటల ప్రత్యక్ష నరకం
గోవా పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే.. ఏకంగా 8 గంటల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించారట. ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.30 గంటల సమయం మధ్య ఆమె హత్య జరిగిందని అంటున్నారు. అప్పటికి నిందితుడు రాజ్‌కుమార్ సింగ్ బలవంతంగా ఆమె ఫ్లాట్‌లోకి ప్రవేశించి 8 గంటలు అయ్యింది.
అతడు అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఘర్డే ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించాడని, ఆమె సాయం కోరుతూ గట్టిగా అరుస్తుండగానే అతడు ఆమె నోరు నొక్కేసి, కత్తితో బెదిరించాడని పోలీసులు తెలిపారు. రాజ్‌కుమార్ సింగ్ ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘర్డే శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ పంటిగాట్లు ఉండటంతో.. నిందితుడిని పరీక్షించేందుకు గోవా దంతవైద్య కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఘర్డే శరీరం మీద ఉన్న గాట్లతో అతడి పళ్ల సైజు కూడా సరిపోయినట్లు తేలింది. ఈ కేసులో తాజాగా తాము ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 392 (దోపిడీ)లను కూడా జతచేసినట్లు సలిగావో పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు.