goa perfumer
-
ఆమెకు 8 గంటల ప్రత్యక్ష నరకం
గోవా పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే.. ఏకంగా 8 గంటల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించారట. ఈనెల 6వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.30 గంటల సమయం మధ్య ఆమె హత్య జరిగిందని అంటున్నారు. అప్పటికి నిందితుడు రాజ్‌కుమార్ సింగ్ బలవంతంగా ఆమె ఫ్లాట్‌లోకి ప్రవేశించి 8 గంటలు అయ్యింది. అతడు అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఘర్డే ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించాడని, ఆమె సాయం కోరుతూ గట్టిగా అరుస్తుండగానే అతడు ఆమె నోరు నొక్కేసి, కత్తితో బెదిరించాడని పోలీసులు తెలిపారు. రాజ్‌కుమార్ సింగ్ ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘర్డే శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ పంటిగాట్లు ఉండటంతో.. నిందితుడిని పరీక్షించేందుకు గోవా దంతవైద్య కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఘర్డే శరీరం మీద ఉన్న గాట్లతో అతడి పళ్ల సైజు కూడా సరిపోయినట్లు తేలింది. ఈ కేసులో తాజాగా తాము ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 392 (దోపిడీ)లను కూడా జతచేసినట్లు సలిగావో పోలీసు ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. -
పోర్న్ వీడియోలు చూపించి రేప్.. ఆపై హత్య
-
ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. దొరికేశాడు!
-
పోర్న్ వీడియోలు చూపించి రేప్.. ఆపై హత్య
గోవా పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్యకేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజ్‌కుమార్ సింగ్ ఆమెకు ముందుగా ఫోన్లో మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించి, ఆపై అత్యాచారం చేసి హతమార్చినట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఇంతకుముందు భావించినట్లుగా ఇది ఏదో అనుకోకుండా చేసిన హత్య కాదని.. ముందుగానే అతడు ప్లాన్ చేసుకుని మరీ హతమార్చాడని గోవా డీఐజీ విమల్ గుప్తా తెలిపారు. ఆరోజు జరిగిన పరిణామాలను ఆయన మీడియాకు వెల్లడించారు. సెక్యూరిటీ సూపర్వైజర్గా నటించి అక్కడకు వచ్చిన రాజ్‌కుమార్ సింగ్ తలుపు తట్టాడు. మోనిక తలుపు తీయగానే బలవంతంగా లోనికి వచ్చి ఆమెను కత్తితో బెదిరించాడు. ఆమె అరిచేలోపే ఆమె నోరు నొక్కేసి.. బాత్రూంలోకి తీసుకెళ్లాడు. దాంతో ఆమె తీవ్రంగా భయపడి దాదాపుగా సగం స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను మంచం మీద పడుకోబెట్టి రెండు చేతులు, కాళ్లు కట్టేశాడు. ఆమె ఏమీ చేయలేదని నిర్ధారించుకున్న తర్వాత డబ్బులు డిమాండ్ చేశౄడు. పర్సులో 4వేలు ఉండటంతో అవి తీసుకొమ్మని ఆమె చెప్పింది. అది చాలదని, మరింత ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన ఏటీఎం కార్డు తీసుకొమ్మని చెప్పడంతో పాటు పిన్ నెంబరు కూడా చెప్పేసింది. తర్వాత ఆమె సెల్‌ఫోన్ లాక్కుని, దాని పాస్వర్డ్ అడిగాడు. ఫోన్ తెరిచిన తర్వాత ఆమెకు బలవంతంగా మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించాడని డీఐజీ వెల్లడించారు. తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడన్నారు. ఆ తర్వాత తాను ఆమెకు బాగా తెలుసు కాబట్టి పోలీసులకు ఫిర్యాదుచేస్తుందన్న భయంతో ఆమె పీక పిసికి, దిండుతో ఆమె ముఖం మీద కూడా నొక్కి చంపేసినట్లు గుప్తా తెలిపారు. మొట్టమొదటిసారిగా జూన్ 7వ తేదీన ఈ అపార్టుమెంటులో ఏవైనా ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయా అని అడిగేందుకు మోనికా ఘర్డే అక్కడకు వచ్చారని, అప్పుడు ఆమెకు ఫ్లాట్ల వివరాలు చెప్పేటప్పుడే ఆమె పట్ల రాజ్‌కుమార్ సింగ్ ఆకర్షితుడయ్యాడని చెప్పారు. అప్పటినుంచి ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ.. ఒక్కరే ఉంటున్నట్లు తెలుసుకున్నాడన్నారు. తన కారు కడిగేందుకు మోనిక అతడిని నియమించినప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం పెంచాడు. అప్పటినుంచి ఆమె ఫ్లాట్‌లో అణువణువూ అతడికి తెలుసన్నారు. జూలై 22న అతడిపై మోనిక సహా పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతోపాటు రెండు నెలల జీతం కూడా ఇవ్వలేదు. ఆమె కారణంగానే ఇదంతా జరిగిందని కక్ష పెంచుకుని.. ఆమె పట్ల వ్యామోహం, కక్ష రెండింటితో ఇలా చేశాడని పోలీసులు వివరించారు. -
ఆమెను నగ్నంగా షూట్ చేయాలనుకున్నా
ప్రముఖ పెర్ఫ్యూమ్ పరిశోధకురాలు మోనికా ఘర్డే హత్యకేసులో సంచలన వాస్తవాలు బయట పడుతున్నాయి. ఆమెను హత్యచేశానని పోలీసుల విచారణలో అంగీకరించిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్ సింగ్ పలు వాస్తవాలు వెల్లడించాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు నగ్నంగా చిత్రీకరించాలనుకున్నట్లు చెప్పాడు. అయితే మోనికపై అత్యాచారం చేశాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోడానికి పోలీసులు అతడిని ఇంకా ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన రాజ్‌కుమార్ (21) గతంలో సప్నా రాజ్ వ్యాలీలో వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. అక్కడే మోనిక మృతదేహం లభించింది. ఆమె ఏటీఎం కార్డును ఉపయోగించి బెంగళూరులో డబ్బులు డ్రా చేసినట్లు తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బెంగళూరులో రాజ్‌కుమార్‌ను అరెస్టుచేసి, ట్రాన్సిట్ వారంటు మీద గోవాకు తీసుకొచ్చారు. బెంగళూరులో పోలీసులు విచారించినప్పుడే రాజ్‌కుమార్ పలు విషయాలు వెల్లడించాడు. ముందుగానే ఇంటి ఆనుపానులు తెలిసి ఉండటంతో వెనకవైపు ఫెన్సింగ్ దూకి కాంపౌండ్‌లోకి ప్రవేశించాడు. ఆమె ఇంట్లో దోపిడీ చేయాలని వచ్చాడు. ప్లాట్‌లోకి ప్రవేశించగానే కత్తి చూపించి బెదిరించి, మాట్లాడకుండా ఉండాలని చెప్పాడు. తర్వాత ఆమె చేతులు కట్టేసి, ఏటీఎం కార్డు తీసుకుని.. పిన్ నెంబరు కూడా బలవంతంగా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆమె దుస్తులు విప్పి సెల్ఫోన్లో షూట్ చేయాలనుకున్నానని, ఆ చిత్రం ఆధారంగా తాను ఆమెను బెదిరించాలనుకున్నానని చెప్పాడు. అయితే నిజంగా అలా షూట్ చేశాడో లేదో మాత్రం ఇంకా తెలియలేదు. మోనిక ముక్కు, నోరు మూసేసి ఊపరిడాకుండా చేసి చంపేసినట్లు తెలిపాడు. తొలుత ఆమె స్పృహతప్పి ఉంటుందని భావించానన్నాడు. ఆమెను చంపేసిన తర్వాత వంటగదిలోకి వెళ్లి.. రెండు కోడిగుడ్లు ఉడికించి, వాటిని తిన్నాడు. ఆమె లేస్తుందేమో అని కాసేపు భయపడ్డాడు. కానీ అప్పటికీ ఇంకా లేవకపోవడంతో తట్టి చూసి.. చనిపోయిందని తెలుసుకుని అక్కడినుంచి పారిపోయాడు. -
ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. దొరికేశాడు!
గోవాకు చెందిన పెర్ఫ్యూమ్ స్పెషలిస్టు మోనికా ఘర్డే హత్యకేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె డెబిట్ కార్డు దొంగిలించిన నిందితుడు.. దాంతో బెంగళూరులో డబ్బులు డ్రా చేయడంతో దొరికిపోయాడు. మోనికా ఇంతకుముందు ఉండే అపార్టుమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. మోనికాను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. అతడు ఆమెను ఎందుకు చంపాడన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ హత్యకేసులో ఇంకెవరూ లేరని.. అతడొక్కడే ఈ ఘాతుకానికి పాల్పడాడని ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికి బెంగళూరులోనే ఉన్న రాజ్‌కుమార్‌ను గోవా పోలీసుల కస్టడీకి ఇచ్చిన తర్వాత అతడిని గోవాకు తరలిస్తారు. హత్యకు కారణం ఏంటో తెలుసుకోడానికి అతడిని విచారిస్తామని పోలీసులు తెలిపారు. అలాగే బాధితురాలిపై అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోడానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా సోమవారం వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. మోనికా ఒక ఫొటోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకుని 2011లో గోవాకు వెళ్లిపోయింది. అయితే గత ఏడాది నుంచి ఆమె తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.