మోనో రైలు వచ్చేసింది!
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శనివారం వడాలా డిపోలో జెండా ఊపి మోనో రైలును ప్రారంభించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ఈ రైలులో తొలిసారి ప్రయాణించేందుకు రాజకీయ ప్రముఖులతోపాటు ఉన్నతాధికారులు వడాలా డిపోకు వచ్చారు. వీరి టలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎంఆర్‌డీఏ అధికారులున్నారు. వడాలా డిపో నుంచి బయలుదేరిన మోనో రైలు 20 నిమిషాల్లో చెంబూర్ స్టేషన్‌కు చేరుకుంది. మోనో రైలు సేవలు ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రైలును ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినా.. ఆయన రావడం కుదరకపోవడంతో సీఎం ప్రారంభించారు. మోనో రైలును ప్రారంభంలో ప్రతీ 15 నిమిషాలకు ఒకటి చొప్పున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నడపనున్నారు. నెల తర్వాత రెండు షిఫ్టుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులను పెంచనున్నారు.
- ఒక బోగీలో 20 మంది కూర్చొని, 130 మంది నిలబడి ప్రయాణించే వీలుంది. మొత్తం నాలుగు బోగీల్లో ఒకేసారి 600 మంది ప్రయాణించవచ్చు. ఒక్క గంటలో సుమారు 20 వేల మందికిపైగా ప్రయాణికులు ప్రయాణించేందుకు ఆస్కారం.
- రైలు మార్గం పొడవు.. 8.93 కిలోమీటర్లు. వేగం.. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్లు
- అన్నీ ఎయిర్ కండిషన్డ్ బోగీలు. మొదటి బోగీ నుంచి చివరి బోగీ వరకు వెళ్లొచ్చు
- చార్జీ రూ.5. కార్డు పంచింగ్ చేశాకే రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశం
- మెట్రో రైలుతో పోల్చితే మోనో రైలు నిర్మాణ వ్యయం చాలా తక్కువే. ్ఞ నగరాల్లోని రోడ్లు విస్తరించేందుకు (వెడల్పు) స్థలం లభించని సమయంలో మోనో రైలు చాలా తక్కువ స్థలంలో పరుగెత్తనున్నాయి. ముఖ్యంగా భూమికి సుమారు 20 నుంచి 30 అడుగుల ఎత్తుపై నుంచి వెళ్లే ఈ రైళ్లు రోడ్ల మధ్య ఉండే డివైడర్లపై ఒకే ఒక్క స్తంభంపై రెండు రైళ్లు వెళ్లేందుకు రైల్వేమార్గం.
- వడాలా-చెంబూర్‌ల మధ్య బస్సు ప్రయాణం వేగవంతం
మెట్రోరైళ్లు సహా సాధారణంగా రైళ్లు సమాంతరంగా ఉండే రెండు పట్టాలపై నడుస్తాయి. మోనోరైళ్లకు ఒకే పట్టా ఉంటుంది. పట్టా వెడల్పు కూడా రైలు కంటే చాలా తక్కువగా ఉంటుంది. తొలుత జర్మనీలో మోనోరైళ్లు ప్రారంభమయ్యాయి. జపాన్‌లో 1950లలో ఇవి ప్రాచుర్యం పొందాయి. ట్రాఫిక్ ఇక్కట్లను గట్టెక్కేందుకు జపాన్ వీటిని విరివిగా వాడుకలోకి తెచ్చింది.