కొత్త రూపాయి నాణేలను స్వీకరించని టీవీఎం మెషీన్‌లు
నిరాశతో వెనుదిరిగిన నగరవాసులు
సాక్షి, ముంబై:
దేశంలోనే ప్రప్రథమంగా ప్రారంభమైన మోనో రైలులో ప్రయాణించేందుకు ఆశగా వచ్చిన ముంబైకర్లకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టికెట్ జారీ చేసే యంత్రంలో సమస్యలు తలెత్తడంతో నిరాశగా వెనుదిరిగారు. అయితే ఈ టికెట్ వెండింగ్ మిషన్(టీవీఎం) పురాతన రూపాయి నాణేలను మాత్రమే స్వీకరిస్తోంది. కొత్త రూపాయి నాణేలను స్వీకరించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నాణేలను ఈ మిషన్ స్వీకరిస్తున్నప్పటికీ టికెట్లను మాత్రం జారీ చేయడం లేదని ప్రయాణికులు వాపోయారు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో చాలా మంది ప్రయాణికులు మోనోరైలులో ప్రయాణించేందుకు స్టేషన్లకు తరలివచ్చారు. అయితే ఈ మిషన్లు పాత నాణేలను మాత్రమే స్వీకరించడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరిగారు.
‘ఈ మిషన్లను మూడు ఏళ్ల క్రితమే సిద్ధం చేసి ఉంచారు. అప్పుడు కొత్త ఒక్కరూపాయి నాణేం అందుబాటులోకి రాకపోవడంతో ఈ నాణాన్ని టీవీఎం మిషన్ తిరస్కరిస్తోంద’ని ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ఇండియన్ మాన్యుఫాక్చర్స్’ నుంచి కొనుగోలు చేసిన ఈ యంత్రాలు వడాలాలోనే కాకుండా ఇతర స్టేషన్లలో కూడా పనిచేయలేదన్నారు. వీటివల్ల తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతుండటంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి వీటి సేవలను నిలిపివేశామని తెలిపారు. చాలామంది ప్రయాణికులు కొత్త రూపాయి నాణేలను ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ మిషన్‌లు తరచూ పని చేయకుండా పోతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రయాణికులు ఏ నాణేం ఇన్సర్ట్ చేసిన ఈ మిషన్ స్వీకరించే విధంగా త్వరలోనే తీర్చిదిద్దుతామని అధికారి వెల్లడించారు.
‘మోనో’ ప్రయాణికులకు పాట్లు
Published Tue, Feb 4 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement
Advertisement