అన్న పంచర్ చేస్తే.. తమ్ముడు చైన్ లాగాడు | Mulayam has punctured the 'cycle', Shivpal broke its chain, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

అన్న పంచర్ చేస్తే.. తమ్ముడు చైన్ లాగాడు

Published Sun, Feb 26 2017 8:11 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

అన్న పంచర్ చేస్తే.. తమ్ముడు చైన్ లాగాడు - Sakshi

అన్న పంచర్ చేస్తే.. తమ్ముడు చైన్ లాగాడు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి ఖాయమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆ పార్టీ గుర్తు సైకిల్‌ను పంచర్ చేయగా, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ చైన్ తెంచారని అన్నారు. దీంతో సైకిల్ నడవలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎస్పీలో ములాయం కుటుంబంలో ఇటీవల విభేదాలు ఏర్పడి, ఆ తర్వాత సమసిపోయిన సంగతి తెలిసిందే. ఎస్పీలో యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్, శివపాల్ వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత విభేదాలను పక్కనబెట్టి తామంతా ఒక్కటేనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎస్పీలో విభేదాల కారణంగా ఆ పార్టీ బలహీనపడిందని రాజ్‌నాథ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement