గాంధీనగర్: పేదల జీవితాన్ని మార్చే, సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్నీ పురోభివృద్ధివైపు నడిపించే సాంకేతిక ఆవిష్కరణల కోసం కృషి చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థినరేంద్ర మోడీ.. సమాచార, సాంకేతిక పరిజ్ఞాన(ఐటీ) నిపుణులకు సూచించారు. దేశంలో అత్యంత పెద్దదైన, ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన 10 వేల సీట్ల టీసీఎస్ గరిమా పార్క్ క్యాంపస్‌ను శనివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఐటీ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో అవినీతిని ప్రధాని నిర్మూలించలేరేమోగానీ.. ఐటీ నిపుణులుగా మీరు ఆ పనిచేయగలరు’’ అని అన్నారు. ‘‘ఐటీ అంటే అది ధనికులకు మాత్రమే సంబంధించిందన్న అపోహ ప్రజల్లో ఉంది. సాంకేతిక ఆవిష్కరణలు పేద ప్రజల జీవితాలను మార్చగలవు’’ అని చెప్పారు.
టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ మాట్లాడుతూ.. కొత్తగా నిర్మించిన టీసీఎస్ గరిమా పార్క్‌లో పది వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. 25.5 ఎకరాల్లో అభివృద్ధిపరిచిన ఈ పార్క్ గుజరాత్‌లో ఐటీ పరిశ్రమ పురోగమనానికి దోహదం చేస్తుందన్నారు. గరిమా పార్క్‌లో లెర్నింగ్ సెంటర్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీసీఎస్ హబ్స్‌ను అనుసంధానం చేస్తూ ఐక్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
ఐటీతో అవినీతికి చెక్
Published Sun, Nov 17 2013 3:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement