'మోడీవి రక్తంలో తడిచిన చేతులు'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై సమాజ్ వాదీ ములాయం సింగ్ యాదవ్ తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మోడీ చేతులు రక్తంతో తడిచాయి అంటూ ములాయం విమర్శించారు. వారణాసిలోని ఓ సభలో మాట్లాడుతూ 2002 సంవత్సరంలో గుజరాత్ లో జరిగిన మత ఘర్షణలను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు అని అన్నారు.
కుల రాజకీయాలకు తమ ప్రభుత్వం దూరమని.. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ ఉత్తమ పాలన అందిస్తోంది అని తెలిపారు. తమపై ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో పస లేదు అని ఆయన అన్నారు. అవినీతిని, ధరల పెరుగుదలను అరికట్టడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందన్నారు. లోకసభ ఎన్నికల తర్వాత సమాజ్ వాదీ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడదని ఆయన జోస్యం చెప్పారు.