నరేంద్ర మోడీ హెలీకాప్టర్కు అనుమతి నిరాకరణ | Narendra Modi's helicopter denied permission to land | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ హెలీకాప్టర్కు అనుమతి నిరాకరణ

Published Tue, Feb 4 2014 7:35 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

నరేంద్ర మోడీ హెలీకాప్టర్కు అనుమతి నిరాకరణ - Sakshi

నరేంద్ర మోడీ హెలీకాప్టర్కు అనుమతి నిరాకరణ

కోల్కతా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రయాణించే హెలీకాప్టర్ను ల్యాండ్ చేయడానికి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. కోల్కతాలో బుధవారం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ ర్యాలీలో మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం రేస్ కోర్సు గ్రౌండ్లో మోడీ హెలీకాప్టర్ను ల్యాండ్ చేయడానికి అనుమతివ్వాలంటూ బీజేపీ నేతలు ఆర్మీని కోరారు. ఈ గ్రౌండ్ ఆర్మీ పరిధిలో ఉంది. అయితే మోడీ హెలీకాప్టర్ను ల్యాండ్ చేయడానికి ఆర్మీ అనుమతి నిరాకరించింది.

దీని వెనుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఆరోపించారు. ఈ విషయం రెండు మూడు రోజులు ముందే చెబినట్టయితే తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవారమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement