మోడీ ప్రచారంతో కాంగ్రెస్‌కే లాభం: సింధియా | Narendra Modi's MP campaign good omen for Congress: Jyotiraditya Scindia | Sakshi
Sakshi News home page

మోడీ ప్రచారంతో కాంగ్రెస్‌కే లాభం: సింధియా

Published Tue, Nov 19 2013 1:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Narendra Modi's MP campaign good omen for Congress: Jyotiraditya Scindia

 ఇండోర్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రచారం వల్ల బీజేపీకి ఒనగూరేదేమీ ఉండదని, ఆయన ప్రచారం తమ పార్టీకే లాభిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘మోడీ మధ్యప్రదేశ్‌కు కొత్తకాదు. 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా పనిచేశారు. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎక్కడైనా సరే మోడీ ప్రచారానికి వెళ్లిన చోటల్లా మా పార్టీనే అధికారంలోకి వచ్చింది. కనుక మధ్యప్రదేశ్‌లో ఆయన ప్రచారం కాంగ్రెస్‌కు శుభశకునం’ అని సింధియా విలేకర్లతో అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement