మోడీ తల్లికి చీర పంపిన పాక్ ప్రధాని | Nawaz Sharif gifts a sari to Narendra Modi mother | Sakshi
Sakshi News home page

మోడీ తల్లికి చీర పంపిన పాక్ ప్రధాని

Published Thu, Jun 5 2014 7:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Nawaz Sharif gifts a sari to Narendra Modi mother

న్యూఢిల్లీ: ఆట కాదు. హృదయాలు గెలవాలన్న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి సలహాను భారత్‌, పాకిస్థాన్ ప్రధానులిద్దరూ ఆచరణలో పెట్టారు. తల్లితో తన దృశ్యాలు చూసి భావోద్వేగానికి గురైన షరీఫ్‌ తల్లికి మోడీ శాలువా పంపగా, షరీఫ్‌ కూడా మోడీ తల్లికి ఓ చీరను పంపారు. ఇద్దరూ అమ్మప్రేమను చాటుకున్నారు. లక్షలాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

తన తల్లికి కానుకగా చీర పంపినందుకు షరీఫ్ కు మోడీ ట్విటర్ లో ధన్యవాదాలు తెలిపారు. ఈ చీరను త్వరలోనే తన తల్లికి అందజేస్తానని అన్నారు. తనకు స్వీట్స్ తినిపిస్తున్న మోడీ తల్లిని చూసి భావోద్వేగానికి గురైన షరీఫ్ తల్లికి అంతకుముందు శాలువా పంపించారు. దీన్ని స్వయంగా తన తండ్రే నానమ్మకు అందజేశారని షరీఫ్ కుమార్తె మర్యామ్ ట్విట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement