Maryam Nawaz Sharif
-
ఇమ్రాన్ ఖాన్‌పై మరియం షరీఫ్ సంచలన ఆరోపణలు.. చివరి క్షణం వరకూ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అధికార పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించారని ధ్వజమెత్తారు. తను పదవిలో ఉన్న చివరి నిమిషం వరకు పాకిస్థాన్ ఆర్మీని వేడుకున్నాడని అన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తనను గట్టెక్కించాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కూడా బతిమాలారని మరియం విమర్శించారు. అవిశ్వాసంపై ఓటింగ్‌ను వాయిదా వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడని, అందుకే తాము అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించామని మరియమ్ అన్నారు. లాహోర్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్‌కు కష్టాలు వచ్చే రోజులు మొదలయ్యాయని మరియం ఆరోపించారు. ఒకవేళ నవాజ్ షరీఫ్ తిరిగి వస్తే ఇమ్రాన్ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకోవాలన్నారు. రాజకీయాలంటే కప్పు టీ తాగినంత సులువు కాదని ఇమ్రాన్ క్రికెట్ ఆడటమే మంచిదని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, త్వరలోనే ఇమ్రాన్‌తోపాటు అతని మంత్రివర్గ సభ్యులు తిరుగులేని అవినీతి ఆరోపణలపై కటకటాల పాలవుతారని మండిపడ్డారు. చదవండి👉 పాకిస్తాన్లో మహిళా సూసైడ్ బాంబర్.. షాకింగ్ విషయాలు వెల్లడి కాగా మూడుసార్లు పాకిస్థాన్‌కు ప్రధానిగా పనిచేసిన నవాజ్‌షరీఫ్ కూతురే మరియం షరీఫ్. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న సమయంలో నవాజ్‌పై అనేక అవినీతి కేసులు పెట్టించాడు. అయితే లాహోర్ హై కోర్టు అనుమతితో 2019 నవంబర్‌లో చికిత్స కోసం లండన్ వెళ్లారు. ప్రస్తుతం పాక్‌లో అధికారంలోకి వచ్చిన పీఎమ్ఎల్ ప్రభుత్వం నవాజ్‌కు కొత్త పాస్‌పోర్టు అందించి అతన్ని దేశానికి తీసుకొచ్చేందుకు మార్గం సుగుమం చేసింది. కాగా 75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌కు షెబాష్ షరీఫ్‌కు మధ్య రాజకీయ వివాదాలు తలెత్తడంతో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సైన్యం నిరాకరించింది. ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మాణం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ 10న పదవి కోల్పోయారు. దీంతో పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాసం ఎదర్కొని పదవీచ్యుతుడైన తొలి ప్రధానికిగా నిలిచారు. చదవండి👉 ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో.. -
ఇమ్రాన్ ఖాన్.. భారత్‌కు వెళ్లిపోండి
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరుగు దేశం భారత్‌ను మరోసారి ఆకాశానికి ఎత్తేసిన వేళ.. ప్రతిపక్ష నేత మరయమ్ నవాజ్ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఈ స్థాయిలో కన్నీళ్లు ఏడ్చే వ్యక్తిని చూడడం ఇదే తొలిసారంటూ వ్యాఖ్యానించిన ఆమె.. ఇమ్రాన్ ఖాన్ పాక్ విడిచి భారత్‌కు వెళ్లిపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురైన మరయమ్ నవాజ్ షరీఫ్.. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు. అంతగా ప్రేమ ఉంటే భారత్‌కి వెళ్లిపోవాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారామె. ‘అధికారం పోతుందని ఇలా మాట్లాడే వ్యక్తిని చూడడం ఇదే. సొంత పార్టీనే ఆయన్ని ఛీ కొడుతోంది ఇప్పుడు. భారత్‌పై అంత ప్రేమ ఉంటే.. పాక్‌ను వీడి అక్కడికే వెళ్లిపొండి’ అంటూ మరయమ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ఖుద్దర్ ఖామ్(ఆత్మగౌరవం) వ్యాఖ్యలు.. అవిశ్వాసం వేళ ఆయనపై రాజకీయ విమర్శలకు తావిచ్చింది. భారతీయులు ఆత్మగౌరవం ఉన్నవాళ్లని, పాక్ ప్రజలు భారత్‌ను చూసి నేర్చుకోవాలని మాట్లాడాడు. రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా.. ఏ మహాశక్తికి లొంగకుండా భారత్ పటిష్టంగా ఉందని, పాక్‌ను మాత్రం విదేశీ శక్తులు ఓ టిష్యూ పేపర్లా చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించాడు. అయితే.. కశ్మీర్ అంశం, ఆరెస్సెస్ సిద్ధాంతాల విషయంలో మాత్రం తనకి కొంత అసంతృప్తి ఉందని, బహుశా ఆ కారణం వల్లనే రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు లేకుండా పోయాయంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు ఇమ్రాన్ ఖాన్. చదవండి: భారత్‌ను ఏ మహాశక్తి శాసించలేదు-ఖాన్ -
బాత్రూమ్లోనూ కెమెరాలు : మాజీ పీఎం కుమార్తె
ఇస్లామాబాద్ : తనను నిర్భందించిన జైలు గది సహా బాత్రూమ్లోనూ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ గతేడాది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలె పాకిస్తాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..తాను రెండుసార్లు జైలు జీవితం గడిపానని,ఈ సందర్భంగా ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది. ఓ మహిళగా తనతో ఎలా వ్యవహరించారు అన్నదానిపై మాట్లాడితే, వారికి ముఖాలు చూపించే ధైర్యం కూడా ఉండదంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. (ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ ) ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని (పిటిఐ) ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్ట్ చేసి, వ్యక్తిగతంగా దాడి చేశారంటే ఇక పాకిస్తాన్‌లోని ఏ మహిళకు రక్షణ లేనట్లే అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లేదా మరెక్కడైనా మహిళలు బలహీనులు కాదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. ప్రస్తుత పిటిఐ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తే, రాజ్యాంగ పరిధిలో సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ సిద్దమేనన్నారు. తాను వ్యవస్థలకు వ్యతిరేకం కాదని, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పిడిఎం) వేదిక ద్వారా చర్చలకు సిద్ధమని పునరుద్ఘాటించింది. మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్‌తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్‌తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, 54 కెనాల్ ల్యాండ్ కేసులో నవాజ్ షరీఫ్, జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. (మాజీ ప్రధానిపై మరో రెండు అవినీతి కేసులు -
నవాజ్ జైలు శిక్ష రద్దు : పాక్ కోర్టు తీర్పు
ఇస్లామాబాద్: అవినీతిలో కేసులో జైలుపాలైన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. అవెన్‌ఫీల్డ్ కేసులో జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌ను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ హై కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత వారం, లండన్‌లో కాన్సర్‌తో చనిపోయిన షరీఫ్ భార్య, కుల్సోంకు అంత్యక్రియల నిమిత్తం నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె 5 రోజుల పెరోల్ మీద విడుదలయ్యారు. తాజా తీర్పుతో వీరిద్దరితోపాటు నవాజ్ షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్దార్ విడుదల కానున్నారు. జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ కోర్టు రద్దు చేసింది. వీరు చట్టాల్ని ఉల్లంఘించలేదని, అవినీతి డబ్బుతో నివాసాలను కొన్నారనడానికి ఎలాంటి రుజువు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్లు, మరియం నవాజ్‌కు 8 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. అల్లుడు కెప్టెన్ సఫ్దార్ కూడా ఈ కేసులో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రూ.5 లక్షల బాండ్ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న ముగ్గుర్ని రిలీజ్ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ ఏడాది జూలై ఆరో తేదీన అవినీతి కేసులో అకౌంటబులిటీ కోర్టు వారికి శిక్ష విధించిన విషయం తెలిసిందే. తమకు విధించిన శిక్షను వీరు ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇటీవల రిజర్వ్‌లో ఉంచింది. అనంతరం బుధవారం వారి శిక్షను సస్పెండ్ చేసింది. -
అంతా అనుకున్నట్లే జరిగింది...
లాహోర్: అవెన్ ఫీల్డ్ కేసులో జైలు పాలైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యమ్‌లు అప్పుడే ఒకరోజు జైలు జీవితం గడిపేశారు. లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లోనే నవాజ్‌ను అదుపులోకి తీసుకుని నేరుగా రావల్పిండిలోని అదియాలా జైల్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఆయనకు బీ క్లాస్ ట్రీట్మెంట్ను అందిస్తున్నట్లు సమాచారం. బీ క్లాస్ వసతులు.. పాక్‌లో నేరం తీవ్రత ఆధారంగా జైల్లో సదుపాయాల కల్పన ఉండదు. ఎంతటి నేరాలు చేసినా.. సోసైటీలో అప్పటిదాకా వారికి ఉండే హోదా, వారి ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు ఆధారంగానే ట్రీట్మెంట్ అందుతుంది. అయితే ఏ క్లాస్ కాకుండా బీ క్లాస్ గదులను నవాజ్‌కు కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. గదిలో ఓ మంచం, ఓ కుర్చీ, చెంబు, మరుగుదొడ్డి సదుపాయం మాత్రమే ఉంటాయి. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే.. గదిలో ఫ్రిజ్, ఏసీ, టీవీ సదుపాయాలను కల్పిస్తారు. అయితే మరియమ్‌కు మాత్రం ఊరటనిచ్చిన అధికారులు.. సీహాలా రెస్ట్ హౌజ్‌కు తరలించి తాత్కాలిక సబ్‌జైలును ఏర్పాటు చేశారు. జైల్లో నవాజ్‌కు బీ కేటగిరీ సదుపాయాలు కల్పించటంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) కార్యకర్తలు మండిపడుతున్నారు. పనామా పత్రాలు, అవినీతి కేసుల్లో, లండన్‌లో అక్రమాస్తుల సంపాదన.. తదితర ఆరోపణలు రుజువు కావటంతో అకౌంటబిలిటీ కోర్టు.. నవాజ్ షరీఫ్(68)కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్(44) ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. షరీఫ్ భార్య అనారోగ్యం కారణంగా లండన్‌లోనే కుటుంబం ఎక్కువగా గడుపుతోంది. అయితే జూలై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఆయన, మర్యమ్‌లు తిరిగి శుక్రవారం స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ పరిస్థితుల మధ్య అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. అరెస్ట్‌కు ముందే షరీఫ్ తనపై చేస్తున్న కుట్రను వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయటం తెలిసిందే. -
నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష
ఇస్లామాబాద్ : అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్ తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. పనామా కుంభకోణంలో బయటపడ్డ షరీఫ్ అవినీతి బాగోతంపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. షరీఫ్‌పై మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో లండన్ అవెన్ఫీల్డ్లోని నాలుగు ఫ్లాట్ల కేసు ఒకటి. కాగా, తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిందిగా షరీఫ్ కోర్టును కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ఈ మేరకు ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా కేసును విచారిస్తూ వస్తోంది. శుక్రవారం కేసులో తీర్పును వెలువరించిన న్యాయమూర్తి నవాజ్ షరీఫ్ 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలియన్ పౌండ్ల జరిమానా విధించారు. మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ పౌండ్ల జరిమానా, సర్దార్కు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తీర్పు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు పాకిస్తాన జాతీయ పత్రిక డాన్ పేర్కొంది. కోర్టు ప్రసారాలను లండన్ నుంచి షరీఫ్ ఫ్యామిలీ లైవ్‌లో తిలకించినట్లు రిపోర్టులు కూడా వస్తున్నాయి. -
షరీఫ్, ఆయన కూతురు, అల్లుడికి షాక్!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పదవీచ్యుత అధ్యక్షుడు నవాజ్ షరీఫ్, ఆయన కూతురు, అల్లుడికి షాక్ తగిలింది. అవినీతి కేసులో వారిపై నమోదైన నేరాభియోగాలను ఖరారు చేస్తూ.. ఇస్లామాబాద్‌లోని అవినీతి నిరోధక కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. 67 ఏళ్ల షరీఫ్, ఆయన కూతురు మరియమ్ నవాజ్, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ మహమ్మద్ సఫ్దార్‌లకు లండన్‌లో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ జాతీయ జవాబుదారీ బ్యూరో (ఎన్ఏబీ) అభియోగాలు మోపింది. ఈ అభియోగాలను ఖరారుచేస్తూ తాజాగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. షరీఫ్, ఆయన తరఫు న్యాయవాది ఖవాజ హారిస్ దేశంలో లేని సమయంలో ఈ కీలక ఆదేశాలు వెలువడటం గమనార్హం. తమకు లండన్‌లో అక్రమాస్తులు లేవని, తమపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలని ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులు కోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా కోర్టు ఇండిక్ట్‌మెంట్ ప్రొసీడింగ్స్‌ను వాయిదా వేయాలంటూ సఫ్దార్ తరఫు న్యాయవాది అంజద్ పర్వేజ్ కోరారు. వీరి అభ్యర్థనలను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. షరీఫ్, ఆయన కుటుంబసభ్యులపై ఎన్ఏబీ ఇప్పటికే పలు అవినీతి కేసులను నమోదుచేసింది. ఈ కేసులన్నింటినీ కలిపి విచారించాలంటూ షరీఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించకముందే.. ఈ మేరకు గట్టి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. ఈ అవినీతి ఆరోపణల కారణంగా ఆయన ఇటీవల ప్రధాని పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. -
మోడీ తల్లికి చీర పంపిన పాక్ ప్రధాని
న్యూఢిల్లీ: ఆట కాదు. హృదయాలు గెలవాలన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సలహాను భారత్, పాకిస్థాన్ ప్రధానులిద్దరూ ఆచరణలో పెట్టారు. తల్లితో తన దృశ్యాలు చూసి భావోద్వేగానికి గురైన షరీఫ్ తల్లికి మోడీ శాలువా పంపగా, షరీఫ్ కూడా మోడీ తల్లికి ఓ చీరను పంపారు. ఇద్దరూ అమ్మప్రేమను చాటుకున్నారు. లక్షలాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. తన తల్లికి కానుకగా చీర పంపినందుకు షరీఫ్ కు మోడీ ట్విటర్ లో ధన్యవాదాలు తెలిపారు. ఈ చీరను త్వరలోనే తన తల్లికి అందజేస్తానని అన్నారు. తనకు స్వీట్స్ తినిపిస్తున్న మోడీ తల్లిని చూసి భావోద్వేగానికి గురైన షరీఫ్ తల్లికి అంతకుముందు శాలువా పంపించారు. దీన్ని స్వయంగా తన తండ్రే నానమ్మకు అందజేశారని షరీఫ్ కుమార్తె మర్యామ్ ట్విట్ చేశారు.