
మణిపూర్ గవర్నర్‌గా నజ్మా
మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు.
పంజాబ్, అస్సాం, అండమాన్‌లకూ కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. వీరంతా బీజేపీతో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి నజ్మా హైప్తుల్లా మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్‌ను పంజాబ్‌కు, ‘ది హితవాద’ దినపత్రిక ఎండీ బన్వారీలాల్ పురోహిత్‌ను అస్సాం గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ జగదీశ్ ముఖికి అండమాన్ నికోబార్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.
76 ఏళ్ల నజ్మా హెప్తుల్లా గత నెలలో కే ంద్ర మంత్రి మండలి నుంచి తప్పుకున్నారు. 68 ఏళ్ల బద్నోర్ స్వరాష్ట్రం రాజస్తాన్. 76 ఏళ్ల పురోహిత్ నాగ్‌పూర్ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అండమాన్ నికోబార్ లñ ఫ్టినెంట్ గవర్నర్‌గా జగదీశ్ ముఖి(73) ఏకే సింగ్ స్థానంలో నియమితులయ్యారు. వీరి నియామకాలకు పూర్వం మణిపూర్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల బాధ్యతలను వరసగా మేఘాలయ గవర్నర్ వి. షణ్ముగనాథన్, హరియాణా గవర్నర్ కప్తాన్ సింగ్, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలక్రిష్ణ అదనంగా నిర్వర్తించారు.