
ఐటీలో జీతాల పెంపు అంతంతే
న్యూఢిల్లీ: ఐటీ సేవలకు డిమాండ్ మెరుగవుతున్నప్పటికీ దేశీయంగా రంగంలో ఉద్యోగుల వలసలు భారీ స్థాయిలో ఉండటం లేదు. అలాగని జీతాల పెంపూ పెద్ద ఎత్తున ఉండటం లేదు. క్రెడిట్ సూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతంలో డిమాండ్ పెరిగితే దానికి అనుగుణంగా జీతాలు, ఉద్యోగుల వలసలు (అట్రిషన్) కూడా ఎక్కువగానే ఉండేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని క్రెడిట్ సూసీ పేర్కొంది. అట్రిషన్ తక్కువ స్థాయిలోనే ఉండటంతో పాటు వేతనాల పెంపు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతోందని వివరించింది. ఎంట్రీ లెవెల్ ఇంజినీర్లకి సంబంధించి వేతనాల విషయంలో భారీగా బేరసారాలు ఆడేందుకు కంపెనీలకు అవకాశం లభించిందని, దీంతో వీరి జీతాల స్థాయి 15 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉంటున్నాయని నివేదికలో వివరించింది.