నేపాల్‌పై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది.
- 54 మంది మృతి
ఖాఠ్మండు
నేపాల్‌పై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. భారీగా కురుస్తున్న వర్షాలు, విరిగి పడుతున్న కొండచరియల వల్ల దేశవ్యాప్తంగా గత రెండు రోజుల్లో కనీసం 54 మంది మృత్యువాత పడ్డారు. అలాగే పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు, వంతెనలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. వరదలు, విరిగిన కొండ చరియల ధాటికి ఒక్క ప్యూథాన్ జిల్లాలోనే కనీసం 26 మంది దుర్మరణం చెందారు.