- 1949లో రేడియోలో పదేపదే ప్రసారమైన వాక్యం
కోల్‌కతా: ‘నేతా సుభాష్ చంద్ర ప్రసారం.. మాట్లాడాలనుకుంటున్నారు.. అనే ఒకే ఒక వాక్యం గత నెల రోజులుగా రేడియోలో పదేపదే వినిపిస్తోంది’ అని నేతాజీ అన్న కుమారుడు అమియానాథ్ బోస్ లండన్‌లో నివసిస్తున్న తన సోదరుడు శిశిర్ బోస్‌కు 1949 నవంబర్‌లో రాసిన లేఖలో ఉంది. 1945లో విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయాడన్నది నిజం కాదంటున్న ఆయన కుటుంబ సభ్యుల వాదనకు ఊతమిచ్చే ఈ లేఖ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తాజాగా బహిర్గత పరిచిన నేతాజీ రహస్య ఫైళ్లలో ఉంది.
‘ రేడియోలో 16ఎంఎం షార్ట్‌వేవ్ ఫ్రీక్వెన్సీ దగ్గరలో ఇది వినిపిస్తోంది. గంటల తరబడి అదే వాక్యం మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. అయితే, అది ఎక్కడినుంచి వస్తుందో కచ్చితంగా తెలియరాలేదు’ అని ఆ లేఖలో అమియా రాశారు. యూరప్ నుంచి వచ్చిన సమాచారంతో.. నేతాజీ చైనాలో క్షేమంగా ఉన్నట్లు ఆయన సోదరుడు శరత్ భావిస్తున్నారని కోల్‌కతాలోని కేంద్ర నిఘా విభాగం పశ్చిమబెంగాల్ డీఐజీకి 1949 జనవరిలో పంపిన నివేదికలో పేర్కొన్నట్లు ఓ ఫైల్లో ఉంది.
‘నేతాజీ మాట్లాడాలనుకుంటున్నారు..’
Published Sun, Sep 20 2015 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM
Advertisement
Advertisement