చెప్పులు పోయాయని కేసు పెట్టాడు | New shoes stolen at Kalkaji temple, case registered | Sakshi
Sakshi News home page

చెప్పులు పోయాయని కేసు పెట్టాడు

Published Wed, May 6 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

చెప్పులు పోయాయని కేసు పెట్టాడు

చెప్పులు పోయాయని కేసు పెట్టాడు

న్యూఢిల్లీ: బహుశా ఇలాంటిది తొలికేసు అనుకుంటా.. కాస్తంత ఆశ్చర్యంగా కనిపించినా.. ఇలాంటి కేసులు అరుదే. దైవ దర్శనానికి వెళ్లిన తన కొత్త బూట్లు పోయాయని కేసు పెట్టాడో వ్యక్తి. దీంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా సిద్ధం చేశారు. ఢిల్లీలోని ప్రముఖ ఆలయమైన కాకాజీ దేవాలయానికి కాన్పూర్కు చెందిన అన్షల్ గుప్తా అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో సహా దర్శనానికి వచ్చాడు. ఆలయంలోకి వెళ్లే క్రమంలో ఆలయం బయట ఉన్న షూ కౌంటర్లో విడిచి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్లాడు.

అరగంట తర్వాత తిరిగొచ్చిన అతడికి షూ కనిపించలేదు. దీంతో అసహనానికి, ఆగ్రహానికి గురైన అతడు ఆలయ నిరాహకులపై చిర్రుబుర్రులాడాడు. తనవి ఎంతో బ్రాండ్ షూ అని, కొత్తగా కొన్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement