
భారీ వరదలతో తొమ్మిది మంది మృతి
బలమైన తుఫాను మూలంగా సంభవించిన వరదలతో తొమ్మిది మంది మృతి చెందారు.
జపాన్ ఉత్తర ప్రాంతంలో తీరం దాటిన ఈ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.