నిర్భయ కేసు అత్యంత అరుదైన ఘటన అని, ఇలాంటి దారుణాలపై కళ్లుమూసుకుని కూర్చోలేమని ప్రత్యేక కోర్టు జడ్జి యోగేష్ ఖన్నాతెలిపారు.
నిర్భయ కేసులో దోషుల నేరం సహించరానిదని, వారు అత్యంత అమానుషంగా, అకృత్యంగా నేరం చేశారని సాకేత్లోని ఫాస్ట్ట్రాక్ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక కోర్టు జడ్జి యోగేష్ ఖన్నా.. శుక్రవారం నాడు నిర్భయ కేసులో్ తీర్పు వినిపించే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులు నలుగురికీ ఐపీసీ సెక్షన్ 302 కింద ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన కుమార్తెకు న్యాయం చేయాలని నిర్భయ తల్లి కోర్టును కోర్టును అభ్యర్థించారు.
వారు అత్యంత అమానుషంగా, అకృత్యంగా నేరం చేశారని, అందుకే దోషులందరికీ మరణదండన విధించామని యోగేష్ ఖన్నా అన్నారు. ఇది అత్యంత అరుదైన ఘటన అని, ఇలాంటి దారుణాలపై కళ్లుమూసుకుని కూర్చోలేమని తెలిపారు. మహిళలపై రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో మౌనంగా ఉండలేమని, ఈ శిక్ష ఒక ఉదాహరణగా నిలవాలని అన్నారు. మహిళల్లో విశ్వాసం పెంచాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.