
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ: తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ తనని కలిసినట్లు చెప్పారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్సత్తా పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తారో లేదో ఆయన్నే అడగండని అన్నారు.
జనతా దర్బార్ కొందరికి ఆశ కలిగించిందని, మరికొందరికి నిరాశ కలిగించిందని కేజ్రీవాల్ చెప్పారు. విద్యుత్ బిల్లును మాఫీ చేస్తామని తాము అనలేదని, బిల్లులను పరిశీలిస్తామని మాత్రమే చెప్పినట్లు తెలిపారు.