
భూ బిల్లుపై వెనక్కి తగ్గం: గడ్కారీ
భూ సేకరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తేల్చిచెప్పారు.
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తేల్చిచెప్పారు. ‘రైతులకు ప్రయోజనకరమైన సవరణలేమైనా ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తే ఆ మేరకు బిల్లులో మార్పులు చేస్తాం కానీ బిల్లుపై వెనకడుగు వేయబోం. దేశానికి మేలు చేసే అంశాలపై బలవంతంగానైనా ముందుకువెళ్తాం’ అని అన్నారు. విక్షాల మద్దతు కూడగట్టే బృందంలో ఒకరైన గడ్కారీ.. రాజకీయ కారణాలతో, ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికే కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకిస్తోందని ఆరోపించారు.
బిల్లును వ్యతిరేకిస్తోంది అతి తక్కువ శాతమన్నారు. ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లుపై పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే బీజేడీ మద్దతు ప్రకటించిందని మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.