27న తాజ్ మహల్ వద్ద మొబైల్స్ పనిచేయవు | No mobile service in Taj city during Obama's visit | Sakshi
Sakshi News home page

27న తాజ్ మహల్ వద్ద మొబైల్స్ పనిచేయవు

Published Fri, Jan 23 2015 6:32 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

27న తాజ్ మహల్ వద్ద మొబైల్స్ పనిచేయవు

27న తాజ్ మహల్ వద్ద మొబైల్స్ పనిచేయవు

ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ వద్ద ఈనెల 27న సెల్ ఫోన్లు పనిచేయవు.

ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ వద్ద ఈనెల 27న సెల్ ఫోన్లు పనిచేయవు. మూడు గంటల పాటు మొబైల్ ఫోన్లు మూగనోము పట్టనున్నాయి. ఇదంతా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన పుణ్యమే. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఒబామా ఈనెల 27న తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.

ఈ నేపథ్యంలో తాజ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఒబామా తాజ్ సందర్శన సమయంలో సెల్ ఫోన్లు పనిచేయకుండా ఎలక్ట్రానిక్ జామర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. తాజ్ గంజ్, మాల్ రోడ్డు, ఫతేబాద్ రోడ్డులో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement