electronic jammers
-
ఒబామా తాజ్‌మహల్ పర్యటన రద్దు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ఒబామా తాజ్ మహల్ పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం అధికారికంగా వెల్లడించింది. కాగా షెడ్యూలు ప్రకారం జనవరి 27న ఒబామా తన సతీమణి మిషెల్లీతో తాజ్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే ఒబామా సౌదీ అరేబియా పర్యటన కారణంగా తాజ్‌మహల్ పర్యటన రద్దు అయినట్లు యూపీ అధికారులు తెలిపారు. దాంతో ఆగ్రా నుంచి అమెరికా భద్రతా బలగాలు వెనుదిగిగాయి. భారత్ పర్యటన అనంతరం ఒబామా సరాసరి సౌదీ వెళ్లనున్నారు. సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అబ్దుల్లా కుబుంబాన్ని ఒబామా పరామర్శించనున్నారు. కాగా ఒబామా తాజ్‌మహల్ ఈ నేపథ్యంలో తాజ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సెల్ ఫోన్లు పనిచేయకుండా ఎలక్ట్రానిక్ జామర్లు ఏర్పాటు చేశారు. -
27న తాజ్ మహల్ వద్ద మొబైల్స్ పనిచేయవు
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ వద్ద ఈనెల 27న సెల్ ఫోన్లు పనిచేయవు. మూడు గంటల పాటు మొబైల్ ఫోన్లు మూగనోము పట్టనున్నాయి. ఇదంతా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన పుణ్యమే. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఒబామా ఈనెల 27న తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో తాజ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఒబామా తాజ్ సందర్శన సమయంలో సెల్ ఫోన్లు పనిచేయకుండా ఎలక్ట్రానిక్ జామర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. తాజ్ గంజ్, మాల్ రోడ్డు, ఫతేబాద్ రోడ్డులో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.