
బీజేపీకి లాభం!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యాటనకు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేకపోయినా బిజెపి నేతలు, కొందరు రాజకీయ పరిశీలకులు ఈ పర్యటన త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి లాభసాటిగా మారనుందని అంటున్నారు.
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యాటనకు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేకపోయినా బిజెపి నేతలు, కొందరు రాజకీయ పరిశీలకులు ఈ పర్యటన త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి లాభసాటిగా మారనుందని అంటున్నారు. ఒబామా పర్యటన కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ట పెరిగిపోయిందని , ఇది ఫిబ్రవరి 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి లాభించగలదని వారు అంటున్నారు.
ఒబామా పర్యటనను బిజెపి విజయంగా బిజెపి నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ కృషి వల్లే ఒబామా భారత్‌కు వచ్చారని ఆమె తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పారు. బిజెపి అభ్యర్థి రాజీవ్ బబ్బర్ మరో అడుగు ముందకు వేసి ఒబామా ఫోటోను తన ఎన్నికల పోస్టర్లలో చేర్చారు.
ఇదిలా ఉండగా, ఒబమా పర్యటనను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేయాలని కొందరు ఆమ్ అద్మీ పార్టీ నేతలు యోచిస్తున్నారు.