సంపూర్ణ గ్రహణాన్ని మనం చూడలేమా?
Published Tue, Aug 22 2017 3:57 PM | Last Updated on Tue, Sep 12 2017 12:46 AM
న్యూఢిల్లీ: పట్టపగలే కారుకున్న కమ్ము చీకట్లు.. కీచురాళ్ల సందడితో వందేళ్లకోకసారి వచ్చే సంపూర్ణ సూర్య గ్రహణాన్ని అమెరికా ప్రజలు వీక్షించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కళ్లజోడు సాయం లేకుండా నేరుగానే తిలకించారు. అదే సమయంలో భారత ప్రజలు మాత్రం డిజిటల్ దర్శనం(టీవీలు, సోషల్ మీడియాలో) సరిపెట్టుకున్నారు.
అయితే ఇలాంటి సంపూర్ణ గ్రహాణాన్ని వీక్షించాలంటే భారతీయులు మాత్రం కొన్ని సంవత్సరాలు ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రెండు మూడేళ్లకోకసారి ఇలాంటి సంపూర్ణ గ్రహణాలు సంభవిస్తుంటాయి. దక్షిణ పసిఫిక్ లేదా అంటార్కిటికా ప్రాంతాల్లో అయితే ఏడాదికొకసారి కూడా వస్తుంటాయి. కానీ, ప్రస్తుతం చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉన్న కారణంగా రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం పూర్తి స్థాయి గ్రహణంను వీక్షించే ఆస్కారం ఏ మాత్రం లేదని వారంటున్నారు. 2019, 2020లో గ్రహణాలు ఉన్నప్పటికీ , 2034లో రాబోయే గ్రహణం మాత్రమే పూర్తిగా దేశం మొత్తం వీక్షించే అవకాశం ఉందని తేల్చేశారు.
డిసెంబర్ 26, 2019లో గ్రహణం దక్షిణ భారత దేశంతోపాటు శ్రీలంక, మలేషియా, సుమట్ర తోపాటు బోర్నియో, గువాం ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించనుంది. జూన్ 21, 2019లో సంభవించే గ్రహణం కేవలం ఢిల్లీతోపాటు ఉత్తర భారత దేశంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీక్షించే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఆ లెక్కన సంపూర్ణ గ్రహణం వీక్షించాలంటే మాత్రం మరో 17 ఏళ్లు ఓపికపట్టాల్సిందే.
Advertisement